Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

వైసీపీ నేత సుబ్బారావును  అదే  పార్టీకి చెందిన సుభాని తన అనుచరులతో కలిసి దాడికి దిగారు.  అయితే ఈ విషయం తెలిసి తాను దాడి చేయ వద్దని వారించినట్టుగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

AP minister Balineni Srinivas Reddy reacts on Subbarao gupta attack
Author
Guntur, First Published Dec 20, 2021, 6:42 PM IST

ఒంగోలు:  Ycp నేత Subba Raoపై అదే పార్టీకి చెందిన subhani తన అనుచరులతో దాడికి దిగారు.. గుంటూరులోని లాడ్జీలో ఉన్న సుబ్బారావు గుప్తాపై   సుభాని దాడికి దిగారు.  ఈ  దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు  కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  దీంతో సుబ్బారావు కోసం  వైసీపీ నేతలు గాలింపు చర్యలు చేపటటారు. గుంటూరులోని లాడ్జీలో సుబ్బారావు ఉన్న విషయం తెలుసుకొని సుబ్బారావుపై  సుభాని ఆయన అనుచరులు సోమవారం నాడు దాడికి దిగారు. అంతేకాదు మంత్రి Balineni Srinivas Reddy కి క్షమాపణలు చెప్పారు. మోకాళ్లపై కూర్చొని సుబ్బారావు గుప్తా క్షమాపణలు చెప్పారు.ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒంగోలులో వైసీపీ నేత గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

పార్టీలోనే ఉండి విమర్శించడంతో తన అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారని ఆయన చెప్పారు. గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి తమ వాళ్లను నివారించే ప్రయత్నం చేశానని  ఆయన తెలిపారు.తాను ఎలాంటి వాడినో ఒంగోలు ప్రజలకు తెలుసునని చెప్పారు. దాడులు చేయడం మా సంస్కృతి కాదన్నారు. తన భర్త మతిస్థిమితం లేదని గుప్తా భార్యే చెప్పిందన్నారు. మతిస్థిమితం లేకే గుప్తా ఆ రోజు సభలో ఆ వ్యాఖ్యలు చేశారు. భార్యే మతిస్థినితం లేదన్న వ్యక్తి కామెంట్లపై నేనేం వ్యాఖ్యలు చేయాలన్నారు.. కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపాను. ఒంగోల్లో టీడీపీ నేతలను కూడా నేను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని మంత్రి చెప్పారు. నాది ఆ సంస్కృతి కాదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముకుంటూ ఉంటారన్నారు.. అన్ని పార్టీల నేతలతోనూ గుప్తాకు పరిచయం ఉంది.  గుప్తాకు నాతో ఎక్కువగానే పరిచయం ఉన్న మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. గుప్తాతో ఎవరైనా ఈ మాటలు అన్పించారా అనే అనుమానం ఉంది. గుప్తా వ్యాఖ్యల వెనుక టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చు.  టెండర్ వేశారని సొంత పార్టీ నేతనే కొట్టిన చరిత్ర దామచర్లకు ఉందని మంత్రి గుర్తు చేశారు. ఆడవారిని విమర్శించడాన్ని ఎవ్వరూ ప్రొత్సహించరన్నారు. ఏ పార్టీ వారైనా ఇంట్లో మహిళల గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తప్పే. ఆ రోజు సభలో సీఎం కూడా లేరు. షర్మిల గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ వాళ్లేమయ్యారని  అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios