మరికొద్ది గంటల్లో ఆ మండపంలో పెళ్లి భాజాలు మోగాల్సి ఉంది. వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. పెళ్లి కూతురు వచ్చి మండపంలో వరుడు కోసం ఎదురు చూస్తోంది. కానీ.... మండపంలో ఉండాల్సిన వరుడు మాత్రం కనపడలేదు. అప్పటి వరకు అక్కడే ఉన్న వరుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. చుట్టుపక్కల గాలించినా పెళ్లి కొడుకు ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో... పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

AlsoRead మొన్న శుభశ్రీ, నేడు అనురాధ.... అన్నాడీఎంకే పార్టీ జెండా మీద పడి.....

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నై మీనమ్ బాక్కమ్ కు చెందిన సుకుమారన్(34) చెన్నై విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతనికి చెన్నై రాయపేటకి చెందిన మహిళతో కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం పల్లావరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

AlsoRead డ్రైడే రోజు చిల్డ్ బీర్ ఆర్డర్ చేసిన టెక్కీ... ఫలితంగా...

బంధువులంతా అప్పటికే మండపానికి చేరుకున్నారు. అంతా సందడిగా ఉంది. మరి కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కలంతా గాలించారు. కానీ ఆచూకీ మాత్రం లభించలేదు.  ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే అతని ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే...  పెళ్లి కొడుకు అదృశ్యంతో వివాహాన్ని రద్దు చేశారు.