పెళ్లిలో పెట్టిన డీజే సౌండ్ తట్టుకోలేక ఓ వరుడు మృతి చెందిన ఘటన బీహార్ లో విషాదాన్ని నింపింది. పరిమితికి మించి సౌండ్ పెట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.  

పాట్నా: బీహార్ లోని పాట్నాలో విషాద ఘటన వెలుగు చూసింది. తన పెళ్లిలో డీజే సౌండ్ తట్టుకోలేక ఓ వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. 
ఈ ఘటన సీతామర్హి జిల్లాలోని ఇందర్వా గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివాహ వేదికపై వరుడు, వధువుతో దండలు మార్చుకున్న కొద్దిసేపటికే వరుడు గుండెపోటుతో మరణించాడు. దీంతో మండపంలోని వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వరుడికి తన 'వర్ మాల' వేడుకలో డీజే మ్యూజిక్ చికాకుగా అనిపించింది. ఎక్కువ డెసిబెల్ శబ్దంతో అసౌకర్యంగా ఫీల్ అవుతూ వేదికపైనే కుప్పకూలిపోయాడు.

సీతామర్హిలోని మణిథర్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ (22) బుధవారం ఇందర్వ గ్రామంలో ఉన్న వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చాడు. వేదికపై వరుడిని చూడగానే అందరూ సంతోషించారు. కాసేపటికి వధువు కూడా వేదికపైకి చేరుకుంది. దంపతులు దండలు మార్చుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే డీజే సంగీతం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఊరేగింపులోని అతని స్నేహితులు రెట్టించిన ఉత్సాహంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. 

తమిళనాడులోని నాగపట్నం సముద్ర తీరంలో క్రూడాయిల్ లీక్.. చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత

విపరీతమైన ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వరుడిని ఇబ్బంది పెట్టాయని సాక్షులు చెప్పారు. వాల్యూమ్ తగ్గించమని లేదా కనీసం డీజేని దూరంగా ఉంచమని అతను పదేపదే అడిగాడు, కానీ అతని అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోలేదు "ఒక్కసారిగా వరుడు వేదికపై కుప్పకూలిపోవడాన్ని మేము చూశాం. అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు" అని స్థానిక గ్రామస్థుడు రాంనందన్ రాయ్ స్థానిక మీడియాకు తెలిపారు. గురువారం స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

'పెద్ద శబ్దం వినికిడిని ప్రభావితం చేస్తుంది, ఆందోళనను పెంచుతుంది'

రెగ్యులేటరీ బాడీ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రస్తుత ట్రెండ్.. దీనివల్లే ఇంత అనర్థం జరిగింది. అధిక సౌండ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందో ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివాస ప్రాంతాలకు పగటిపూట 55 డెసిబెల్, రాత్రి సమయంలో 45 డెసిబెల్ వద్ద సౌండ్ ఉండాలని సిఫార్సు చేసింది. అలా చేస్తే కఠిన శిక్షలు ఉన్నప్పటికీ ప్రజలు వీటిని ఉల్లంఘిస్తున్నారు.చెవి డ్రమ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, నిద్రలేమి, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది, కానీ ప్రజలు దీనిని గమనించడం లేదు" అని బీఎస్ పిసిబి చైర్మన్ అశోక్ కుమార్ ఘోష్ శుక్రవారం తెలిపారు. 

అతను చెప్పిన వివరాల ప్రకారం, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లను, డీజే లను ప్లే చేయడాన్ని నిషేధించారు. నిర్దేశించిన పరిమితిలో సంగీతాన్ని ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. "కానీ మాది సలహా సంస్థ మాత్రమే అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మేము జిల్లా పరిపాలనాధికారులకు తెలియజేసినప్పటికీ, ఆర్డర్‌ను అమలు చేయడానికి మాకు అధికారం లేదు”అని ఘోష్ జోడించారు. "వినికిడి లోపం కలిగించడమే కాకుండా, పెద్ద శబ్దాలు ఆందోళన, డిప్రెషన్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి, అయితే రాష్ట్రంలో పెళ్లి, పండుగల సమయాలు, ఇతర సామాజిక కార్యక్రమాల సమయంలో డీజేలు, లౌడ్‌స్పీకర్‌ల వాడకం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎవరూ దీనిని తీవ్రంగా పరిగణించరు" అని ఈఎన్ టీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభాత్ శంకర్ తెలిపారు.