Asianet News TeluguAsianet News Telugu

పఠాన్ కోట్ ఆర్మీ క్యాంప్ మీద గ్రనేడ్ దాడి... అలెర్ట్..

పఠాన్ కోట్ లోని ఆర్మీ క్యాంప్ సమీప ప్రాంతం గుండా వివాహ బరాత్ వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రేనెడ్ విసిరారని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  అనంతరం వెంటనే అన్ని చెక్ పోస్టు లను అప్రమత్తం చేశారు. నిందితుల కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నారు.

Grenade attack on Pathankot Near Army Camp in Pathankot
Author
Hyderabad, First Published Nov 22, 2021, 4:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పంజాబ్లోని పటాన్ కోట్ లో ఉన్న ఆర్మీ క్యాంప్ సమీపంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. Army Camp సమీపంలోని  త్రివేణి గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున Grenade attack పేలుడు సంభవించినట్లు  అధికారులు తెలిపారు.  దీంతో అప్రమత్తమైన  సైన్యం  ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి  తీసుకున్నట్లు వెల్లడించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  పేలిన  గ్రనేడ్  భాగాలను స్వాధీనం  చేసుకున్నట్లు  తెలిపారు.  అయితే,  ఆ ప్రాంతం గుండా వివాహ బరాత్ వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రేనెడ్ విసిరారని Police తెలిపారు.  అనంతరం వెంటనే అన్ని Check post లను అప్రమత్తం చేశారు.  నిందితుల కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన అనే అంశాన్ని తేల్చడానికి  సీసీ టీవీ ఫుటేజ్ ను  నిశితంగా పరిశీలిస్తున్నారు.  ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని..  దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర లాంబా తెలిపారు.  ఉగ్రవాదులే ఈ పని చేసి ఉంటారని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లోని Dhanbad డివిజన్‌లో శనివారం, నవంబర్ 20 తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. దీంతో పట్టాలు కొంత భాగం దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ పట్టాలు తప్పింది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వారోడ్, బర్కానా సెక్షన్ల మధ్య రైల్వే పట్టాలపై పేలుడు చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనిని అసాధారణ ఘటనగా Railway department పేర్కొంది. అయితే నక్సల్స్‌ ఈ పేలుడు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించనున్నారు. అంతేకాకుండా పేలుడు కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. 

ఇక, నవంబర్ 13 శనివారం నాడు మణిపూర్‌లో జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. Assam Rifles యూనిట్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై దాడి చేశారు. Suraj Chand district జిల్లా బెహియంగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొవాగ్జిన్‌కు యూకే గ్రీన్ సిగ్నల్

ఈ ఘటన శనివారం ఉదయం 10 గంటల సమయంలో చురచంద్‌పూర్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. సైనికులు తేరుకునేలోపు ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్ వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడి వెనుక వున్నట్లు సైన్యం అనుమానిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

manipur ముఖ్యమంత్రి బీరెన్ సింగ్  ఈ మెరుపు దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యను అంత తేలిగ్గా వదిలిపెట్టబోమన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని biren singh అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios