Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ ఇండియా లక్ష్యం నెరవేరాలంటే .. బహుభాషల్లో ఇంటర్నెట్ రావాల్సిందే: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

డిజిటల్‌ ఇండియాలో (digital india) భాగంగా భారతీయులందరికీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కృషి చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ministry of electronics and information technology) సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (rajeev chandrasekhar) తెలిపారు

government planning to promote multilingual internet says union minister rajeev chandrasekhar
Author
New Delhi, First Published Dec 5, 2021, 5:03 PM IST

డిజిటల్‌ ఇండియాలో (digital india) భాగంగా భారతీయులందరికీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కృషి చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ministry of electronics and information technology) సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (rajeev chandrasekhar) తెలిపారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ను బహుభాషల్లో తీసుకొచ్చేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బహుభాషా ఇంటర్నెట్‌పై (multilingual internet) ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో గూగుల్‌ (google) మైక్రోసాఫ్ట్‌ (microsoft), మొజిల్లా సహా అనేక ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ చంద్రశేఖర్ మాట్లాడారు. భారత్‌.. డిజిటల్‌ ఇండియాగా మారాలంటే బహుభాషా ఇంటర్నెట్‌ అత్యవసరమన్నారు. అయితే, దీని అమలును పెద్ద సవాలుగా భావించట్లేదని రాజీవ్ చెప్పారు.  

బహుభాషా ఇంటర్నెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలోని విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా ఆయన అభివర్ణించారు. ప్రాంతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించడాన్ని నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తుందని రాజీవ్ తెలిపారు. కాబట్టి.. ఇంటర్నెట్, టెక్నాలజీ వేదికలు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరముందని ఆయన అన్నారు. బహుభాషల్లో ఇంటర్నెట్‌ను రూపొందించడమే లక్ష్యంగా కార్యాచరణను ఖరారు చేసేందుకు ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటుందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.  

Also Read:26/11 Mumbai Attacks: ఆర్ఎస్ఎస్ ప్లాన్ అని నిందలు వేసిన కాంగీలను మరువొద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

అనంతరం ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్ (ajay prakash) మాట్లాడుతూ.. ఇంటర్నెట్ కోట్లాది మంది భారతీయులకు చేరువైందని అన్నారు. కానీ, అందులోని కంటెంట్‌ మొత్తం ఇంగ్లిష్‌లో ఉండటంతో ఇంకా చాలా మందికి అందుబాటులోకి రాలేదని అజయ్ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, బహుభాషా ఇంటర్నెట్ ద్వారా దాదాపు 40 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను డిజిటల్‌ ఇండియాలో భాగం చేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios