జూన్ నుండి ఆగష్టు వరకు ఉద్యోగుల పీఎఫ్‌పై కేంద్రం గుడ్‌న్యూస్: నిర్మలా సీతారామన్

ఈ ఏడాది జూన్ నుండి ఆగష్టు వరకు ఉద్యోగుల  పీఎఫ్ మొత్తాన్ని చిన్న సంస్థలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు మాసాల  నగదును తామే చెల్లిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

Government extends EPF benefit till August 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నుండి ఆగష్టు వరకు ఉద్యోగుల  పీఎఫ్ మొత్తాన్ని చిన్న సంస్థలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు మాసాల  నగదును తామే చెల్లిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

బుధవారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఆగష్టు వరకు చిన్న సంస్థలు తమ ఉద్యోగుల కోసం పీఎఫ్ కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఉద్యోగుల వాటా, కంపెనీల వాటాను పూర్తిగా కేంద్రమే చెల్లించనున్నట్టుగా ప్రకటించింది. 

also read:చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

దీని విలువ రూ,. 2500 కోట్లుగా ఉంటుందని మంత్రి సీతారామన్ వెల్లడించారు. దీంతో 2.67 లక్షల కంపెనీలతో పాటు 72 లక్షల 22 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని కేంద్రం తెలిపింది. 

కంపెనీలు రానున్న రోజుల్లో పీఎఫ్ కింద గతంలో చెల్లించినట్టుగా 12 శాతం కాకుండా 10 శాతం మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని కేంద్రం తెలిపింది. ఈ మూడు మాసాల పీఎఫ్ ను కేంద్రం చెల్లించడం ద్వారా చిన్న సంస్థల యాజమాన్యాలకు రూ. 6750 కోట్ల మేర ప్రయోజనం కలుగుతోందని ఆమె చెప్పారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోడీ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి రోజూ ఒక్కో రంగానికి సంబందించిన అంశాలపై ఆర్ధిక ప్యాకేజీ గురించి వివరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios