చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 
 

Aatmanirbhar Bharat Abhiyan will spur growth, build a self-reliant India, says FM

న్యూఢిల్లీ:చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్గించేలా కేంద్రం చర్యలు తీసుకొంది. దేశంలోని సుమారు 45 లక్షల పరిశ్రమలకు ప్రయోజనం కలిగేలా రూ. 3 లక్షల కోట్ల రుణాలను అందిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు అందిస్తామన్నారు.ఎంఎస్ఎంఈల రుణాలకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఎంఎస్ఎంఈలకు రుణాలను ఇస్తామన్నారు. 

ఈ రుణాలు సుమారు 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూర్చనుందని కేంద్ర మంత్రి వివరించారు. ఎంఎస్ఎంఈలు తిరిగి తమ ఉత్పత్తులను ప్రారంభించడంతో పాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తామన్నారు.

ఈ నిర్ణయం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట లభించనుందన్నారు.ఎంఎస్ఎంఈలకు 12 నెలల మారటోరియంతో రుణాలు అందిస్తామన్నారు. ఆరు అంశాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను అందిస్తామని ఆమె తెలిపారు.

మొండిబాకీలున్న ఎంఎస్ఎంఈ సంస్థలకు రూ. 20 వేల కోట్లు కేటాయించింది కేంద్రం.దీంతో రెండు లక్షల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతోందని మంత్రి వివరించారు.  సీజీటీఎంఎస్ఈకి కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేలు కేటాయించిందన్నారు.  బ్యాంకులకు సీజీటీఎంఎస్ఈ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వనుంది మంత్రి తెలిపారు.

ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు రూ. 50 వేల కోట్లు కేటాయించినట్టుగా మంత్రి చెప్పారు. వెయ్యి కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను నెలకొల్పుతామన్నారు.ఎంఎస్ఎంఈ  సంస్థలు స్టాక్ ఎక్చేంజ్‌లో లిప్ట్ కావడానికి తోడ్పాటు అందిస్తామన్నారు మంత్రి.

ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తామన్నారు. ఈ సంస్థల పెట్టుబడులు పరిమితిని కూడ  పెంచుతామని మంత్రి తేల్చి చెప్పారు. సూక్ష్మ సంస్థల కేటగిరిని రూ. 25 లక్షల నుండి రూ. కోటి వరకు పెంచామని మంత్రి స్పష్టం చేశారు.

also read:జూన్ నుండి ఆగష్టు వరకు ఉద్యోగుల పీఎఫ్‌పై కేంద్రం గుడ్‌న్యూస్: నిర్మలా సీతారామన్

చిన్న తరహా సంస్థల కేటగిరిని రూ. 5 కోట్ల నుండి రూ.10 కోట్లకు, మధ్య తరహా సంస్థల కేటగిరిని రూ. 10 కోట్ల నుండి రూ. 20 కోట్లకు పెంచుతున్నట్టుగా ప్రకటించారు.
ఈ ఉద్దీపన చర్యలు ఎంఎస్ఎంఈలు బలపడేందుకు దోహపడుతాయన్నారు. ఎంఎస్ఎంఈలను ఈ మార్కెట్లకు అనుసంధానం చేస్తామని చెప్పారు మంత్రి.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రభుత్వ విభాగాల నుండి బకాయిలు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

రూ. 200 కోట్ల వరకు టెండర్లలో విదేశీ కంపెనీలకు అనుమతి ఇవ్వబోమని కేంద్రం ప్రకటించింది. విదేశీ కంపెనీల అనారోగ్య పోటీని తట్టుకొనేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. 

also read:గుడ్‌న్యూస్: 2019-20 ఐటీ రిటర్న్స్‌కు నవంబర్ వరకు గడువు

స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.మంగళవారం నాడు రాత్రి 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. . ఈ మేరకు ప్యాకేజీ వివరాలను ఆమె తెలిపారు.

 ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహాపడనుందని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని మంత్రి తెలిపారు. లోకల్ బ్రాండ్స్ ను అభివృద్ది చేయాలని  ప్రధాని మోడీ చేసిన సూచనను పరిగణణలోకి తీసుకొన్నామని ఆమె చెప్పారు. గత 40 రోజులుగా పీపీఈ యూనిట్స్ ను వెంటిలేటర్లను దేశంలోనే తయారు చేస్తున్నట్టుగా ఆమె గుర్తు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios