Asianet News TeluguAsianet News Telugu

ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వోద్యోగి మృతి..

ఓ ప్రభుత్వోద్యోగి సడెన్ గా కుప్పకూలి మృతి చెందాడు. తన శాఖకు సంబంధించిన ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. 

Government employee died of heart attack while dancing in the event in bhopal - bsb
Author
First Published Mar 21, 2023, 8:16 AM IST

భోపాల్ : సడన్గా గుండెపోటుకు గురై.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయి.. మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అప్పటివరకు బాగున్న వ్యక్తులు జిమ్ చేస్తూనో, సినిమా చూస్తూనో, వాకింగ్ చేస్తూనో, డ్యాన్స్ చేస్తూనో ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమైనాప్పటికీ ఈ ఘటనలో తీవ్రభయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డాన్స్ చేస్తూ చేస్తూ..  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.  

ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.  అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్.. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో సురేంద్ర కుమార్ దీక్షిత్  డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా… అతనికి గుండెపోటు సడన్ గా గుండెపోటు రావడంతో.. చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్  ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

క్రికెట్ ఆడుతూనే కుప్పకూలిపోయాడు.. హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం

దీంతో ఆయనతోపాటు అప్పటివరకు డాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు.  అయినా ఫలితం లేకపోయింది.  ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ లోని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చి 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరిగింది. దాని కంటే  ముందు రోజు మార్చి 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తపాల శాఖ ఉద్యోగి అయిన  సురేంద్ర కుమార్ దీక్షిత్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాటకు నృత్యం చేశాడు. అలా చేస్తూనే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. 

కాగా, జనవరిలో మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ 16యేళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన వెలుగు చూసింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి అనే ఓ విద్యార్థిని చల్లని వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి కిందపడింది. అలా కుప్పుకూలిపోయిన ఆమె ఆ తరువాత మృతి చెందింది. రిపబ్లిక్ డే ఈవెంట్స్ లో భాగంగా రిహార్సల్స్ కోసం వెళ్లిన వ్రిందా.. పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ విద్యార్థిని ఆస్పత్రికి వచ్చేసరికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios