Asianet News TeluguAsianet News Telugu

రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త..త్వ‌ర‌లో అందుబాటులోకి వందే భార‌త్-2 హై స్పీడ్ రైళ్లు

అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే వందే భారత్ -2 హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి రాన్నాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ రైళ్లు అధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన ఫీచర్లను అందించనున్నాయి. 

Good news for railway passengers..Vande Bharat-2 high speed trains to be available soon
Author
First Published Sep 10, 2022, 11:04 AM IST

కేంద్ర ప్ర‌భుత్వం రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. అధునాత సౌక‌ర్యాల‌తో స‌రికొత్త వందే భార‌త్-2 హైస్పీడ్ రైళ్ల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ రైల్వేస్ డిపార్ట్మెంట్ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. కేరళ సహా ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు

వందే భారత్- 2 కేవలం 52 సెకన్లలో గంట‌కు 0 నుండి 100 కిలో మీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైళ్లు గంట‌కు 180 గరిష్ట వేగంతో ప్ర‌యాణిస్తాయి. ఈ రైళ్ల‌లో 430 టన్నులకు బదులుగా 392 టన్నుల తక్కువ బరువు క‌లిగి ఉంటాయి. WI-FI సౌక‌ర్యంతో పాటు మెరుగైన అన్ని ఫీచ‌ర్ల‌ను ఇందులో అందుబాటులో ఉంచనున్నారు.

మునుపటి వందే భార‌త్ రైళ్ల‌లో 24 అంగుళాల ఎల్సీడీ టీవీలు ఉండగా.. వీటిల్లో 32 అంగుళాల టీవీల‌ను అమ‌ర్చ‌నున్నారు. ఇందులో ఉండే 15 శాతం ఎక్కువ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలు, డస్ట్-ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటర్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. కొత్త రైలు 130 సెకన్లలో 160 కిమీ వేగాన్ని అందుకోనుండ‌గా.. పాత రైళ్ల‌లో అది 146 సెకన్లుగా ఉంది.

వివాహేతర సంబంధం : ప్రియురాలి కుమార్తెపై కన్నేసిన ఎస్సై.. ఏడేళ్లుగా లైంగిక వేధింపులు.. పెళ్లైనా వదలకపోవడంతో...

ప్ర‌స్తుతం ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణీకులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యం కొత్త రైళ్ల‌లో అన్ని క్లాసుల‌కు అందుబాటులోకి రానుంది. వందే భారత్ -2 ఎక్స్‌ప్రెస్  కొత్త డిజైన్‌లో ఎయిర్ ఫ్రెషింగ్ కోసం రూఫ్ మౌంటెడ్ రూఫ్ మౌంటెడ్ ప్యాకేజీ యూనిట్ (RMPU)లో ఫోటో-ఉత్ప్రేరక అల్ట్రా వైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIO), చండీగఢ్ సిఫార్సు చేసిన ప్రకారం దీనిని ఇన్‌స్టాల్ చేశారు. స్వచ్ఛమైన గాలి వ‌చ్చేందుకు, అలాగే గాలి ద్వారా వ‌చ్చే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ మొదలైన వాటి నుండి ఫిల్టర్ చేయడానికి, శుభ్రం చేయ‌డానికి ఈ RMPU వ్య‌వ‌స్థను రెండు చివ‌ర్ల‌లో ఏర్పాటు చేస్తారు.

బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యత అవ‌స‌రం - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

కొత్త రైలులో ప్రయాణీకుల మ‌రిన్ని సౌకర్యాలు ఉండ‌నున్నాయి. ఈ ట్రైన్ మూడు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. వందే భారత్ అనేది ఇండియ‌న్ రైల్వేస్ నిర్వ‌హించే ఆటో పైలెట్ EMU రైలు. దీనిని 18 నెలల వ్యవధిలో భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవ ద్వారా చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రూపొందించారు. దీనిని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ఈ రైళ్ల‌ను ట్ర‌య‌ల్ రన్ నిర్వ‌హించిన త‌రువాత 2019 ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఆవిష్క‌రించారు. కాగా ఆగస్టు 2023 నాటికి 75 వందే భార‌త్ -2 రైళ్లను తయారు చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios