Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : ప్రియురాలి కుమార్తెపై కన్నేసిన ఎస్సై.. ఏడేళ్లుగా లైంగిక వేధింపులు.. పెళ్లైనా వదలకపోవడంతో...

తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కూతురు మీద కన్నేశాడో కామాంధుడు. ఆమె మీద ఏడేళ్లుగా లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. చివరికి పెళ్లైనా వదలకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు. 

Extra marital affair : SI Sexual abuse girlfriend's daughter for seven years arrested in chenni
Author
First Published Sep 10, 2022, 9:52 AM IST

చెన్నై :  చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ చట్టం కింద అరెస్టు చేశారు.  చెన్నై సమీపంలోని  పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు.  ఇతనికి విల్లివాక్కం కు చెందిన ఒక మహిళ తో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.  ఆ మహిళకు ఒక కుమార్తె కూడా ఉంది. 

ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై  సబ్ ఇన్స్పెక్టర్ కనపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సుమారు ఏడేళ్లుగా బాలికపై ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు. ఇటీవలే మరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చిన సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

అతని వేధింపులు భరించలేక, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధింపులకు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమెకు మరొకరితో వివాహమైనప్పటికీ లైంగిక వేధింపులు ఆపలేదని, దీంతో సబ్ ఇన్స్పెక్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్ కుమార్ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ డి.ఎస్.పిఅనిల్ కుమార్ తెలిపారు.

తన కుమారుడు పవన్ కుమార్ మే 8వ తేదీన సాయంత్రం పాల ప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27 వ తేదీన సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పవన్‌దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కుమార్ తండ్రి చనిపోయాడు. 

ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీష్ తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు.  జగదీష్ ని సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేష్ (33)తో పవన్ కు మంచి స్నేహం ఉంది. సురేష్ కన్ను పవన్‌ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి పవన్ తో పాటు పవన్ తల్లి నిరాకరించింది. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేష్ లత తో వివాహేతర సంబంధం ఉన్న జగదీష్ ను సంప్రదించాడు.

ఇద్దరూ ఏకమై పవన్ ని చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. అయితే మే 8వ తేదీన పవన్ కు డబ్బులు అవసరమై సురేష్ను 2000 అప్పు అడిగాడు. సురేష్ వెయ్యి రూపాయలు ఇచ్చి, మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. సాయంత్రం వెయ్యి రూపాయల కోసం పవన్ ఫోన్ చేయగా సురేష్ సువాడ శంకర్ తో కలిసి ముగ్గురు ఒకే వాహనంపై కల్లు తాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్ బైక్ దిగుతుండగానే కర్రతో పవన్ పై దాడి చేశాడు. దీంతో పవన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios