Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో బయటపడిన వేల ఏళ్ల నాటి రహస్యనిధి

తమిళనాడులో బయటపడిన వేల ఏళ్ల నాటి రహస్యనిధి

Gold Treasur Found in Keeladi Tamil nadu

తమిళనాడులో వేల ఏళ్ల నాటి బంగారు నిధి లభ్యమైంది. మధురై జిల్లా కీలడి పరిసరాల్లో పురాతన కాలం నాటి నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారులు ఆ నిర్మాణాలలో తవ్వకాలు చేపట్టారు.. గత రెండేళ్లుగా వారు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో అద్దాలతో రూపొందించిన వస్తువులతో పాటు నవరత్నాలు పొదిగిన వస్తువులు బయటపడ్డాయి. అయితే నాలుగో విడత పరిశోధనల్లో మాత్రం బంగారు నిధి దొరికినట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ బావులు, ఆ బావుల మధ్య భాగంలో రహస్య గది, అందులో నుంచి గుహలోకి వెళ్లేలా మార్గాలు ఉన్నాయి.. వీటిలో బంగారు నిధి ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. నాలుగో విడత తవ్వకాలు పూర్తయితే కానీ.. నిధి గురించి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భారత పురావస్తు శాఖ తెలిపింది. మరోవైపు నిధి విషయం బయటకు రావడంతో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

Follow Us:
Download App:
  • android
  • ios