Viral: కాఫీ బాటిళ్లలో 3.8 కేజీల బంగారం స్మగ్లింగ్...!

బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు అధికారులు 18 మంది కెన్యా మహిళలను విమానాశ్రయంలో తనిఖీ చేశారని ఆయన చెప్పారు.

Gold Pours Out Of Coffee Flask At Mumbai Airport

బంగారం స్మగ్లింగ్ చేయడానికి.. కొత్త కొత్త  పద్దతులను వెతుకుతున్నారు. ఇప్పటి వరకు.. షూల్లో.. అందులో.. ఇందులో.. ఇలా పెట్టుకుంటూ తీసుకువచ్చేవారు. తాజాగా...  కొందరు మహిళలు.. కాఫీ బాటిళ్లలో దాచుకుంటూ  తీసుకువచ్చారు. అయితే..  ముంబయి ఎయిర్ పోర్టులో.. అడ్డంగా వారు అధికారులకు దొరికిపోవడం గమనార్హం.

Also Read: Omicron variant: క‌ల‌వ‌ర‌పెడుతున్న ఒమిక్రాన్‌.. కొత్త‌గా మ‌రో 8 కేసులు.. మొత్తం 153

పూర్తి వివరాల్లోకి వెళితే... షార్జా నుంచి వచ్చిన కెన్యా మహిళల బృందం బంగారం స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు దొరికిపోయారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కాఫీ పౌడర్ బాటిళ్లలో దాచిపెట్టిన 3.8 కిలోల అప్రకటిత బంగారాన్ని, కొన్ని ప్రైవేట్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు, స్మగ్లింగ్ చేస్తున్న వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు అధికారులు 18 మంది కెన్యా మహిళలను విమానాశ్రయంలో తనిఖీ చేశారని ఆయన చెప్పారు.మహిళలు తీసుకెళ్తున్న కాఫీ పౌడర్ బాటిళ్లు, ఇన్నర్‌వేర్ లైనింగ్‌లు, పాదరక్షలు, మసాలా బాటిళ్లలో బంగారాన్ని కడ్డీలు, వైర్లు, పౌడర్‌ల రూపంలో దాచి ఉంచారు. కొన్ని కోట్ల విలువైన 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఒక కెన్యా మహిళ పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకెళ్తున్నందున అరెస్టు చేయగా, ఇతరులను వెళ్ళడానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోని ఇక్కడ చూడొచ్చు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios