గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు: కాళీచరణ్ మహరాజు అరెస్ట్
మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రాయ్‌పూర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నాథూరామ్ గాడ్సేను అభినందిస్తూ కాళీచరణ్ మహరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయ్‌పూర్: జాతిపితMahatma Gandhiని కించపరచడమే కాకుండా గాంధీని చంపిన Nathuram Godse ను అభినిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన Kalicharan Maharaj ను రాయ్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోకు 25 కి.మీ దూరంలోని బాగేశ్వర్ దామ్ సమీపంలో కాళీచరణ్ మహారాజ్ అద్దెకు ఉంటున్నాడు. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో కాళీచరణ్ ను అరెస్ట్ చేసినట్టుగా రాయ్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. Raipur మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. రాయ్‌పూర్‌లోని తిక్రపారా పోలీస్ స్టేషన్ లో కాళీచరణ్ మహరాజ్ పై FIR నమోదైంది.
also read:కంగనా రనౌత్‌పై మహాత్మా గాంధీ మునిమనవడు ఫైర్.. ‘పిరికిపందలు ఎవరంటే?’
కాళీచరణ్ పై ఐపీసీ 505(2) , 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు రాయ్‌పూర్ లోని రావణ్ భటా మైదానంలో జరిగిన ధరమ్ సన్సద్ లో కాళీచరణ్ ప్రసంగించారు. రాజకీయాల ద్వారా దేశాన్ని స్వాధీనం చేసుకోవడమే ఇస్లాం లక్ష్యమని కూడా కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు.
మహత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేకి సెల్యూట్ చేస్తున్నానని ఆయన తెలిపారు. హిందూ మతాన్ని రక్షించుకోవడానికి ఒక స్థిరమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని కూడా కోరారు.ఈ అరెస్ట్ నుండి తప్పించుకొనేందుకు కాళీచరణ్ మహరాజు సహా ఆయన అనుచరులు సెల్‌ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేశారు. అయితే పోలీసులు కాళీచరణ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు రాయ్‌పూర్ కు కాళీచరణ్ మహరాజును తీసుకొని వచ్చే అవకాశం ఉంది.
కాళీచరణ్ మహరాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ నేత ప్రమోద్ దూబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని కాళీచరణ్ పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఛత్తీస్‌ఘడ్ లోని దుదాధారి దేవాలయం వద్ద మత గురువు కాళీచరణ్ మహరాజ్ సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామ్ సుందర్ దాస్ పాల్గొన్నారు.
నాథూరామ్ గాడ్సేను కాళీచరణ్ అభినందించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే నిరసనగా ఈ కార్యక్రమం నుండి వెళ్లిపోయారు. ఈ వేదికపై కాళీచరణ్ మహరాజు మహత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే తప్పుబట్టారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గాంధీజీ దేశం కోసం పని చేశారని గుర్తుంచుకోవాలని కోరారు. అందుకే గాంధీజీని జాతిపిత అంటారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేస్తున్నారు
.ఆదివారం నాడు జరిగిన ధరం సంసద్ కార్యక్రమానికి సుమారు 20 మందికి పైగా మత పెద్దలు హాజరయ్యారు. వీరిలో చాలా మంది హిందువులు ఆయుధాలు చేపట్టాలని హిందూ దేశ స్థాపనకు తమను తాము సిద్దం చేసుకోవాలని కోరారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన సదస్సు తర్వాత హరిద్వార్ లో కూడా ఇదే తరహ సమ్మేళం ఈ నెల 17 నుండి 19వ వరకు జరిగింది.