గోద్రా రైలు దహనం కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయకూడదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో రాష్ట్రం టాడా నిబంధనలను ప్రయోగించినందున దోషులు విడుదలకు అర్హులు కాదని పేర్కొంది. 

2002 గోద్రా రైలు దహనం కేసులో దోషులు రాష్ట్ర పాలసీ ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులు కాదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. శిక్షపై వాదనల సందర్భంగా గోద్రాలో రైలును తగులబెట్టిన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో తెలిపారు. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ముందు ఎస్జీ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ముంబై ఈవెంట్‌లో గాయకుడు సోనూ నిగమ్, బృందంపై దాడి.. పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు..

రాష్ట్ర ముందస్తు విడుదల విధానం కింద దోషులు విడుదలకు అర్హులేనా అని సీజేఐ అడిగిన ప్రశ్నకు ఎస్జీ మెహతా సమాధానమిచ్చారు. టాడా నిబంధనలను ప్రయోగించినందున దోషులు ముందస్తు విడుదలకు అర్హులు కాదని, 59 మంది మరణానికి కారణమైనందున ఈ కేసు అత్యంత అరుదైన కేటగిరీ కిందకు వస్తుందని ఆయన ధర్మాసనానికి తెలిపారు.

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న జీపు బోల్తా .. ఐదుగురు మృతి.. 21 మందికి గాయాలు..

‘‘59 మందిని సజీవ దహనం చేసిన ఘటన ఇది. (రైలు) బోగీని బయటి నుంచి లాక్ చేయడం స్థిరంగా ఉంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. శిక్షను సవాలు చేసిన మొదటి దోషిని చూడండి. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లో అతడిని గుర్తించారు. ప్రయాణికులను బయటకు రానివ్వకూడదనే ఉద్దేశంతోనే రాళ్లు విసురుతున్నాడని మెహతా తెలిపారు.

Liquor Shops Ban: మందుబాబులకు షాకింగ్‌! మద్యం దుకాణాలు, బార్లు మూసివేత

మెహతా వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సంబంధిత వివరాలతో నిందితుల చార్ట్ ను తయారు చేయాలని పిటిషనర్లను, రాష్ట్ర న్యాయవాదిని ఆదేశిస్తూ పిటిషన్లను మూడు వారాల తర్వాత వాయిదా వేసింది. దోషులకు శిక్షను ధ్రువీకరిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇటీవల మరణశిక్షలను తగ్గించింది. కాగా.. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీకి దుండగులు నిప్పు పెట్టారు. ఇందులో 59 మంది మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన రేకెత్తించింది.