మధ్యప్రదేశ్ ఉన్న మద్యం షాపులు, బార్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలు, బార్‌లకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో మద్యం సేవించడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది

మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మందుబాబుల గుండె పలిగే లాంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, బార్లను మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అహటాస్' లేదా మద్యం దుకాణాలు , షాప్ బార్‌లకు అనుబంధంగా ఉన్న మద్యపాన ప్రాంతాలు మూసివేయాలని, కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో అన్ని అహటాలు , షాప్ బార్‌లు మూసివేయబడ్డాయి. ఇప్పుడు, షాపుల్లో మాత్రమే మద్యం విక్రయించబడుతుందని తెలిపారు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మతపరమైన స్థలాల నుంచి మద్యం దుకాణాల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసే చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు కృషి చేస్తున్నారనీ, కాబట్టి 2010 నుండి రాష్ట్రంలో కొత్త దుకాణం తెరవలేదనీ అని అన్నారు. దీనికి విరుద్ధంగా, దుకాణాలు మూసివేయబడ్డాయని మిశ్రా చెప్పారు. మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో "నియంత్రిత మద్యం పాలసీ" కోసం భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకురాలు ఉమాభారతి డిమాండ్ మధ్య ఇది ​​జరిగింది. దీంతో ఎక్కడపడితే అక్కడకాకుండా కేవలం మద్యం షాపుల్లో మాత్రమే మద్యం విక్రయించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే నర్మదా సేవా యాత్రలో భాగంగా  రాష్ట్రంలో 64 దుకాణాలను మూసివేసినట్లు మిశ్రా తెలిపారు. కాగా ఉమాభారతి గత కొద్ది కాలంగా మద్యం వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మద్యం విక్రయాలకు నిరసనగా.. మద్యం దుకాణాల ముందు ఆవులను కట్టేసి ‘మధుశాల మే గోశాల’ కార్యక్రమంలో ‘పాలు తాగండి, మద్యం తాగవద్దు’ అని ఉద్బోధించింది. గతంలో ఈ షాపులపై ఉమాభారతి పేడను విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.