మేఘాలయలోని నార్త్ గారో హిల్స్ జిల్లాలో ఎన్నికల ర్యాలీకి హాజరవుతున్న జీపు బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.

మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లో సోమవారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం అస్సాంలోని గోల్‌పరా ఆసుపత్రికి తరలించామని నార్త్ గారో హిల్స్ పోలీస్ చీఫ్ శైలేంద్ర బమానియా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ప్రత్యేక అతిధిప్రసంగించనున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు అదోగరే గ్రామానికి చెందిన వారు జీపులో వెళ్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

మృతులను మెరీనా సంగ్మా, సబీనా మరక్, కుకిలా మోమిన్, టెస్సా సంగ్మా, సోసిన్ మారక్‌లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతులందరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నయి. అందుకే ఓటర్ల ఓట్లను రాబట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మేఘాలయ శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రికి తప్పిన పెనుప్రమాదం

సోమవారం నాడు హర్యానాలోని పానిపట్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు బిప్లబ్ కుమార్ దేబ్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ మేరకు పోలీసులు సమాచారం ఇచ్చారు. హర్యానా ఇంచార్జి దేబ్ ఢిల్లీ నుండి చండీగఢ్ వస్తుండగా సమల్ఖా నుంచి పానిపట లోకి మధ్య ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సమల్ఖా) ఓం ప్రకాష్ ఫోన్‌లో తెలిపారు.టైర్ పంక్చర్ కావడంతో జీటీ రోడ్డులో కారు ఆగి ఉందని, వెనుక నుంచి వస్తున్న దేబ్ కారు ఢీకొట్టిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. కారు.