Asianet News TeluguAsianet News Telugu

Goa Assembly Polls: మా పథకం వాళ్లదట, ఆయనో పెద్ద కాపీ మాస్టర్.. కేజ్రీవాల్‌పై గోవా సీఎం సెటైర్లు

బీజేపీ నేత, గోవా సీఎం (goa cm) ప్రమోద్ సావంత్ (pramod sawant).. అర్వింద్ కేజ్రీవాల్‌పై సెటైర్లు వేశారు. ఆయనో కాపీ మాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ పథకాలను కేజ్రీవాల్ కాపీకొడుతున్నారని సావంత్ ఆరోపించారు. 

goa cm sawant calls arvind kejriwal as copy master
Author
Goa, First Published Nov 4, 2021, 3:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గోవా అసెంబ్లీ ఎన్నికలు (goa assembly polls) సమీపిస్తున్న వేళ బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు తృణాముల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కూడా  రెడీ అవుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాల్లో ఆ పార్టీ అగ్రనేతలు బిజీగా వున్నారు. ఇక ఇటీవల గోవాలో పర్యటించిన ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) .. అక్కడ తాము అధికారంలోకి వస్తే ఉచిత తీర్థయాత్రలు కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామాలయ (ayodhya rama mandiram)  దర్శనం, రాజస్థాన్‌లోని ఆజ్మీర్ షరీఫ్ (ajmer sharif) , తమిళనాడులోని వేళాంగణి‌కి (velankanni) తీర్థయాత్రకు వెళ్లాలనుకునే గోవా ప్రజలకు ఉచిత తీర్థయాత్ర పథకాన్ని అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీని వల్ల గోవాలోని పేద హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.

దీనిపై స్పందించిన బీజేపీ నేత, గోవా సీఎం (goa cm) ప్రమోద్ సావంత్ (pramod sawant).. అర్వింద్ కేజ్రీవాల్‌పై సెటైర్లు వేశారు. ఆయనో కాపీ మాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ పథకాలను కేజ్రీవాల్ కాపీకొడుతున్నారని సావంత్ ఆరోపించారు. తీర్థయాత్రలకు ప్రభుత్వ సాయం అందించే పథకాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే తీసుకురాగా.. ఇది తమ పార్టీదిగా కేజ్రీవాల్ ప్రకటించుకోవడం విడ్డూరమన్నారు. తీర్థయాత్రలకు ఆర్థిక సాయం పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించామని.. నోటిఫై కూడా చేసినట్లు సావంత్ వెల్లడించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. అయితే కేజ్రీవాల్ ఈ పథకాన్ని కాపీ కొట్టి తమ పార్టీదిగా ప్రకటించుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా ఇతరుల పథకాలని కాపీ కొట్టే అలవాటు కేజ్రీవాల్‌కు ఎక్కువే ఉందని.. అందుకే ఆయన కాపీ మాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు.

Also Read:అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

ఇకపోతే గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన అర్వింద్ కేజ్రీవాల్.. గత నాలుగు నెలల్లో మూడుసార్లు అక్కడ పర్యటించారు. జులైలో అక్కడ పర్యటించిన కేజ్రీవాల్.. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రైవేటు రంగం సహా అన్ని ఉద్యోగాల్లో 80 శాతం గోవా స్థానికులకు దక్కేలా చూస్తామని ప్రకటించారు. అలాగే టూరిజం, మైనింగ్ రంగాలు గాడిలో పడే వరకు ఈ రంగంతో జీవనోపాధి పొందుతున్న కుటుంబాలకు ప్రతి నెలా రూ.5000ల రెమ్యునరేషన్ అందజేయనున్నట్లు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు గోవాకు చెందిన ప్రముఖ నేతలు ఆప్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పలు పార్టీల నేతలతో ఆప్ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios