భారత సారథ్యంలో జీ20 సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం జీ20 దేశాల ఆరోగ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ కోసం డబ్ల్యూహెచ్‌వో అంగీకారం కుదిరింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్ అధనామ్ హర్షం వ్యక్తం చేశారు. 

న్యూఢిల్లీ: భారత సారథ్యంలోని జీ20 గ్రూప్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా డిజిటల్ హెల్త్ కోసం కృషి చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్(జీఐడీహెచ్) కోసం అంగీకారం కుదిరింది. జీఐడీహెచ్ ఒక నెట్‌వర్క్‌గా, ఒక ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తుంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. డిజిటల్ హెల్త్ కోసం గ్లోబల్ స్ట్రాటజీని అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావిస్తున్నది. ఆ లక్ష్యంతో కోసం కృషి చేస్తున్నది. ప్రపంచశ్రేణి ప్రమాణాలు, శ్రేష్టమైన విధానాలు, వనరుల ద్వారా డిజిటల్ హెల్త్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో డబ్ల్యూహెచ్‌వో కీలక పాత్ర పోషించనుంది.

డిజిటల్ హెల్త్ కరోనా కల్లోల కాలంలో మన దేశంలో ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టెలి అసిస్టింగ్, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి గైడ్ లైన్స్‌పై అవగాహన తేవడానికి, పాటించాల్సిన ముందు జాగ్రత్తలు, లక్షణాలు వెల్లడించడానికి, టెస్ట్, ట్రాక్‌ల కోసం డిజిటలైజేషన్ ఎంత ఉపకరించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

శనివారం నాటి సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్ మాట్లాడుతూ. .ఆరోగ్యరంగంలో తమ కృషిని గుర్తించినందుకు జీ20కి ధన్యవాదాలు తెలిపారు. జీఐడీహెచ్ నెట్ వర్క్ సృష్టించడానికి, దానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి సంయుక్తంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఆరోగ్యపరంగా డిజిటల్‌గా పరిష్కారాలు పొందడానికి, భావి సమానత్వాన్ని చూడటానికి డబ్ల్యూహెచ్‌వో ఇతర దేశాలతో కలిసి పని చేస్తున్నదని, తద్వార తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నదని పేర్కొన్నారు.

జీఐడీహెచ్ ప్రారంభిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా మాట్లాడారు. జీ20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ విజయాల్లో గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ కీలకమైందని వివరించారు. జీ 20 భారత సారథ్య సమయంలో సాధించిన గొప్ప విజయాల్లో ఈ కార్యక్రమమూ ఒకటని తెలిపారు.

జీఐడీహెచ్ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యాల కోసం భాగస్వామ్య దేశాలు కలిసికట్టుగా పని చేసి ఘనమైన ఫలితాలను ఈ విధంగా సాధించాల్సి ఉంటుంది.

సరైన ప్రాధమ్యాలతో డిజిటల్ హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషనర్ కోసం కచ్చితమైన పెట్టుబడి వ్యూహాలు రూపొందించుకోవాలి

డిజిటల్ హెల్త్ రీసెర్సెస్‌ను మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి. ప్రతిదాని గురించి ఓపెన్‌గా వ్యవహరించాలి

నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. వేర్వేరు రీజియన్‌ల నుంచి సహకారాలను పరస్పరం అందిపుచ్చుకోవాలి.

దేశీయంగా డిజిటల్ హెల్త్ గవర్నెన్స్ కోసం ప్రభుత్వ వ్యూహాలకు మద్దతుగా ఉండాలి.

డిజిటల్ హెల్త్ 2020-2025 అమలు కోసం కోసం సాంకేతిక సహాయం, ఆర్థిక మద్దతును మిళితం చేసుకోవాలి.

Also Read: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌ను తిరస్కరిస్తే.. అనివార్యంగా సైనిక పాలనను ఆహ్వానించడమే!

డబ్ల్యూహెచ్‌వో 2005లో తొలిసారిగా ఇ-హెల్త్ తీర్మానం చేసినప్పటి నుంచి డిజిటల్ హెల్త్‌కు ఉపకరించేలా డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ స్ట్రాటజీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇందు మూలంగా 120 డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు జాతీయ డిజిటల్ హెల్త్ విధానాలు, వ్యూహాలను అభివృద్ధి చేసుకున్నాయి.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కోసం, ఆరోగ్యసంబంధ స్థిర అభివృద్ధి లక్ష్యాలు (2030)ను సాధించడానికి డిజిటల్ హెల్త్ నిరూపితమైన మార్గం. ప్రతి వ్యక్తి వైయక్తికంగా తమ ఆరోగ్యాన్ని మేనేజ్ చేసుకోవడానికి, ఆరోగ్యసంరక్షణ పొందడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుంది. ఉన్నత శ్రేణి సేవలను అందుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, సప్లై చైన్స్, శ్రమ శక్తి నిర్వహణలో ఆరోగ్య వ్యవస్థలో గణనీయమైన మార్పులకు దోహదపడుతుంది.