బెర్నీశాండర్స్‌ను మీరు వద్దనుకుంటున్నారంటే.. ట్రంప్‌  రాకను ఆమోదిస్తున్నట్టే చెప్పిన సందర్భమే ఇప్పుడు పాకిస్తాన్‌కు కూడా వర్తిస్తుంది. ఇమ్రాన్ ఖాన్‌ను మీరు తిరస్కరిస్తే.. అనివార్యంగా సైనిక పాలనను ఆహ్వానిస్తున్నట్టే అని ప్రముఖ, సీనియర్ జర్నలిస్టు సయీద్ నఖ్వి వివరించారు.  

న్యూఢిల్లీ: పెట్టుబడిదారీ విధానానికి జంటగా ఉండే ఉదార ప్రజాస్వామ్యం.. ప్రస్తుత నిస్పృహ, నిరాశామయ పాకిస్తాన్‌లో పతనం వైపు మరో అడుగు వేస్తున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పంథాలో సాహసపూరితంగా హామ్లెట్(షేక్స్‌పియర్ నాటకం) నాటకం ఆడుతున్నది. పాకిస్తాన్‌ విషయాన్ని చూస్తే ఇక్కడ రాకుమారుడు జైలులో ఉన్నాడు. ఇదంతా ఇలా జరిగింది.

పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రపై ఓ వీడియో క్లిప్ రూపొందించింది. వరల్డ్ కప్ కోసం ఈ ప్రిపరేషన్ చేసింది. ఈ వీడియో పాకిస్తాన్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ దృష్టికి వచ్చింది. శ్రీలంకలో వార్మప్ మ్యాచ్‌ కసరత్తులు కవర్ చేయడానికి ల్యాండ్ అయిన వెంటనే వసీం అక్రమ్ ఈ వీడియో చూసి తన జీవితంలోనే ఎన్నడూ ఎరుగని విధంగా ఖంగుతిన్నట్టు వెల్లడించారు. ఈ వీడియోలో గ్రేట్ ఇమ్రాన్ ఖాన్ కనిపించలేదని చెప్పారు. 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ తెచ్చిన టీమ్‌కు ఇమ్రాన్ కెప్టెన్. ఇదంతా విషపూరితమైనది కదా.

పాకిస్తాన్‌లో రాజకీయ విభేదాలు ఎలాగైనా ఉండుగాక, ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో ఇమ్రాన్ ఖాన్ ఒక ఐకాన్, పాకిస్తాన్‌ టీమ్‌ను బలోపేతం చేయడంలో కీలకకర్తగా వ్యవహరించిన వాస్తవంలో భేదాభిప్రాయాలు అక్కర్లేదని అక్రమ్ తెలిపారు. పీసీబీ వెంటనే ఈ వీడియో డిలీట్ చేసి ఇమ్రాన్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ ప్లేయర్‌లలో ఒకరైన వసీం అక్రమం ఒక్కసారిగా అంతలా అసంతృప్తి వ్యక్తం చేయడం అతనికి పరిమితమై ఉంటుందా? ఆయన ఫాలోవర్లూ పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) మొత్తం ఈ మెస్సేజీలతో నిండిపోయింది. ఇదే అసంతృప్తి వీధుల్లోకి ఎక్కడానికి ఎంత కాలం పడుతుందో?

దీంతో పీసీబీ వెంటనే ఆ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్‌కు దక్కాల్సిన గౌరవాన్ని ఇస్తూ వీడియోలో చేర్చింది.

క్రికెట్ ప్రపంచంలో ఇమ్రాన్ ఖాన్ స్థానానికి గల్లంతు చేద్దామని చేసిన ప్రయత్నాలు కేవలం క్రికెట్‌కే పరిమితమై లేవని తెలిసిందే. పాకిస్తాన్ చరిత్రలోనే పాపులర్ పొలిటీషియన్‌గా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయ రంగం నుంచీ తుడిచేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీసీఐ పాకిస్తాన్ కౌంటర్‌పార్ట్‌కు సమాధానంగా ప్రమోషనల్ వీడియోలో పాక్ టీమ్ సభ్యుడు బాబర్ ఆజామ్‌ను వదిలిపెట్టింది.

క్రికెట్‌ను ఆరాధించే ఓ 11వ తరగతి పిల్లాడు నా వద్దకు వచ్చి.. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే అంత పాపులర్ పొలిటీషియన్ అయితే.. ఆయన ఎందుకు జైలులో ఉన్నాడు? అని అడిగాడు.

Also Read: కశ్మీరీ టెర్రరిస్టుకు ఆ స్వచ్ఛంద సంస్థపై ఎందుకంత నమ్మకం? తన బిడ్డను అక్కడే పెంచాలని ఆదేశం

1989లో బెర్లిన్ గోడను కూల్చివేసిన తర్వాత ప్రభుత్వాలు ప్రజలను ఎన్నికల ఫలితాలనిచ్చేవారిగా చూడటం మొదలుపెట్టాయి. నిజంగానే ప్రజలు ఆ ఫలితాల నిర్ణేతలైతే అమెరికాలో బెర్నీ శాండర్స్, యూకేలో జెరెమీ కోర్బిన్ వారి ప్రత్యర్థులను తుత్తునియాలు చేసి ఉండాల్సింది.

2016లో ఫాక్స్ న్యూస్ ఓ పోల్ పబ్లిష్ చేసింది. అందులో బెర్నీ శాండర్స్ 28కి మించి రేటింగ్ లభించింది. ఇది అమెరికాలోని ఉభయ రాజకీయ శిబిరాల్లోని నేతలందరికీ కంటే కూడా ఎంతో ఎక్కువ. దీనిపై ది గార్డియన్‌కు చెందిన ట్రెవర్ టిమ్ సూటిగా ఓ కామెంట్ చేశాడు. ఇలాంటి అంకెలు చూసిన తర్వాత ఎవరైనా డెమోక్రటిక్ రాజకీయ నేతలు బెర్నీ శాండర్స్‌తో చేతులు కలపడానికి వెంపర్లాడుతారనే భావనలోకి వస్తారనే అనుకుంటారు. ఎందుకంటే రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్ కంటే మొత్తం డెమోక్రాట్లకు ఉన్న ఆకర్షణ తక్కువ. కానీ, ఇలాంటిదేమీ జరగడం లేదు. ఆయన సందేశాన్ని ఖాతరు చేయకపోగా.. ప్రతి మలుపులో శాండర్స్‌ను దారుణంగా అడ్డుకునే పని ఆ పార్టీ చేస్తున్నది.. అని అన్నారు.

ఎన్నికల రాజకీయాలను తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చెప్పడానికి మీకు మరో ఉదాహరణను ఇవ్వనివ్వండి. 2020లో ప్రైమరీస్(అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ)‌లో 2016 నాటిలాగే శాండర్స్ ఇతర నేతలకంటే ముందంజలో ఉన్నారు. ఆయనకు ముకుతాడు వేయడానికి న్యూయార్క్ మాజీ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ బరిలోకి దిగాడు. ఆయన ఎంట్రీ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఎడిటోరిల్ కాలమ్స్‌లో రూపంలో రెండు పేజీల్లో మైఖేల్‌ను సమర్థిస్తూ వ్యాసాలు వచ్చాయి.

2016లో డొనాల్డ్ ట్రంప్ దూసుకురావడానికి ఏర్పడ్డ అనుకూల పరిస్థితులను పరిశీలిస్తే ఇలాంటి పరిణామాలే కనిపిస్తాయి. అందుకే కాలమిస్టు సుర్జీత్ భల్లా వీటిని సరిగ్గా ఒక వాక్య రూపంలో వెల్లడించారు. ‘ట్రంప్ విజయం పాశ్చాత్య నాగరికతకు ముగింపు’ అని అన్నారు.

నా వైఖరి సుస్పష్టం. ‘మీరు ఒక వేళ శాండర్స్‌ను వద్దనుకుంటే ట్రంప్ రాక అనివార్యం’. ఇదే సందర్భం పాకిస్తాన్‌కు కూడా వర్తిస్తుంది. ‘ఒక వేళ మీరు ఇమ్రాన్ ఖాన్‌ను వద్దనుకుంటే ఆర్మీ రూల్ అనివార్యమవుతుంది.’

అనిశ్చితితో ఆమోదముండే ప్రజాస్వామ్యాలు.. ఆ 11వ తరగతి పిల్లాడికి మోసపూరితమైనా ఆకర్షణీయంగా కనిపించే లక్ష్యం వైపుగా సాగుతాయి. ది ఎకనామిస్ట్‌లో ఇటీవల కనిపించిన హెడ్‌లైన్ కేవలం లాటిన్ అమెరికన్లకే కాదు అందరికీ భయానకమే. యువ లాటిన్ అమెరికన్లు నియంతృత్వానికి అంగీకరించేవారు కాదు. ఈ హెడింగ్ ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని అర్థం అవుతున్నది.

లాటిన్ అమెరికాలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పోల్‌లో అక్కడి యువత ముఖ్యంగా తక్కువ వయసున్నవారి అభిప్రాయాలు కలవరపెడుతున్నాయి. 17 మంది ప్రపంచ నేతలకు వారి ఆమోదాన్ని ఒకటి నుంచి పది రేటింగ్‌లో చెప్పాలని ఆ పోల్ కోరింది. ఆ ప్రపంచ నేతల జాబితాలో పోప్ ఫ్రాన్సిస్, వొలోడిమైర్ జెలెన్‌స్కీ కూడా ఉన్నారు. ఆ యువత ఎవరికి ఆమోదం తెలిపిందో గెస్ చేయండి? ఆ ఆమోదం చిన్న వయసులో ఉన్నవారిలో బలంగా ఉన్నది.

ఈ అసాధారణ పాపులర్ నేత 2019లో కనిపించిన ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ బుకేలే. ఆ దేశంలోని గ్యాంగ్‌స్టారిజాన్ని తొలగిస్తానని తరుచూ ఆయన వల్లెవేస్తుంటాడు.

2022 మార్చిలో జవాబుదారీతనం, ఎవరూ బాధ్యతవహించాల్సిన అవసరం లేని రీతిలో.. గ్యాంగ్‌లపై దాడి అంటూ 87 మందిని హత్యచేసింది ఈయన పాలనలోనే. 70 వేల మంది యువతను జైళ్లలో బంధించాడు. తనను తాను ప్రపంచంలోనే కూలెస్ట్ డిక్టేటర్ అని పిలుచుకుంటాడు. 2024 జనరల్ ఎలక్షన్స్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఆయనకు 80 శాతం ఆమోదం ఉన్నది. ఉదార ప్రజాస్వామ్య శవపేటికకు చివరి మొలను గట్టిగా దింపేసి తనను తాను జాగ్రత్తగా సమర్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఎల్ సాల్వడార్‌లో కనీసం స్మశానాలపై ఉండే శాంతియుత వాతావరణం కూడా కనుమరుగైపోతుందనిపిస్తున్నది. గుర్తుపెట్టుకోండి ఆ నియంత వయసు 41 ఏళ్లే.

----- సయీద్ నఖ్వి (ప్రముఖ జర్నలిస్టు)