లిప్ స్టిక్, బాబ్ కట్ హెయిర్ తో అమ్మాయిలు వస్తారు -మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లు లిప్ స్టిక్, బాబ్ కట్ తో ఉన్న అమ్మాయిలకు ఉపయోగపడుతుందని బీహార్ లోని ఆర్జేడీకి చెందిన సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ అన్నారు. ఈ బిల్లులో వెనకబడిన, అత్యంత వెనకబడిన వర్గాల వారికి కోటా ఇచ్చి ఉంటే బాగుండేదని తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆర్జేడీ సీనియర్ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు లిప్ స్టిక్, బాబ్ కట్ హెయిర్ ఉన్న అమ్మాయిలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ముజఫర్ పూర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత
మహిళా రిజర్వేషన్లపై అబ్దుల్ బారీ సిద్ధిఖీ ప్రసంగిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల వారికి కోటా ఇస్తే బాగుండేదని అన్నారు. ‘‘ రిజర్వేషన్ పేరుతో మహిళలు లిప్‌స్టిక్, బాబ్ కట్‌తో వస్తారు.. మీరు (కేంద్ర ప్రభుత్వం) ఇవ్వవలసి వస్తే వెనుకబడిన, అత్యంత వెనుకబడిన మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వండి. లేదా వెనుకబడిన తరగతుల వారికి కూడా కోటా ఇస్తే బాగుండేది. లేకుంటే ఆడవాళ్ళ పేరుతో బాబ్ కట్, లిప్ స్టిక్ పెట్టుకుని వచ్చేస్తారు. ’’ అని అన్నారు.
ఈ సందర్భంగా టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తన కార్యకర్తలకు అబ్దుల్ బారీ సిద్దిఖీ సూచించారు. ఈ విషయంలో వారితో ప్రమాణం కూడా చేయించారు. టీవీలు, సోషల్ మీడియా వార్తలు చూస్తూ, అందులోనే ఇరుక్కుపోతే ఎవరి ప్రతిష్ట పెరగదని, చదువు కూడా పెరగదని అన్నారు. లోక్ సభ ఎన్నికల వరకైనా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరారు.
200 మంది మహిళల ఫొటోలు తీసి, అశ్లీలంగా మార్చిన ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉద్యోగి.. తరువాత ఏం జరిగిందంటే ?
ఇదిలా ఉండగా.. ఈ నెలలో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తాజాగా ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేయడంతో అది ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం వల్ల చట్ట సభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ కానున్నాయి. అయితే కాకపోతే ఆ రిజర్వేషన్లు జనాభా గణన, డీలిమిటేషన్ తరువాత అమల్లోకి రానుంది.