సవతి తండ్రితో ప్రేమాయణం.. 40 కోట్ల ఆస్తి దక్కదని.. తల్లిని కిరాతకంగా హత్య చేయించిన కూతురు..
బికామ్ చివరి సంవత్సరం విద్యార్థిని అయిన యువికా రెడ్డి అప్పటికే తన తల్లితో విడిగా ఉంటోంది. సవతి తండ్రితో ప్రేమలో పడడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ మేరకు అర్చనా రెడ్డి ఈ నవంబర్ చివరి వారంలో భారతీయ శిక్షాస్మృతి 498A కింద రెండవ భర్త, జిమ్ ట్రైనర్ అయిన నవీన్ కుమార్ (33) మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
బొమ్మనహళ్లి : హత్యకు గురైన archana reddy కేసులో పోలీసులు ఆమె రెండో భర్తతో పాటు కుమార్తె సహా ఏడుగురిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న నగరానికి చెందిన అర్చనా రెడ్డి హోసూరు రోడ్డులో కారులో వస్తుండగా కొందరు అడ్డుకుని నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులకు అర్చనారెడ్డిని murderకు ఆమె రెండో భర్త నవీన్ తో పాటు ఆమె కుమార్తె యువికారెడ్డి (21) కుట్ర పన్నినట్లు తేలింది.
నవీన్ రూ.40కోట్ల propertiesలు చేయిజారి పోయే ప్రమాదం ఉందని యువికారెడ్డికి చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేయడానికి సతీశ్ తో పాటు మరికొంతమందిని ఏర్పాటు చేశారు. ఈనెల 27న జిగిని పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారులో వస్తుండగా అతి దారుణంగా నరికి చంపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, బికామ్ చివరి సంవత్సరం విద్యార్థిని అయిన యువికా రెడ్డి అప్పటికే తన తల్లితో విడిగా ఉంటోంది. సవతి తండ్రితో ప్రేమలో పడడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ మేరకు అర్చనా రెడ్డి ఈ నవంబర్ చివరి వారంలో భారతీయ శిక్షాస్మృతి 498A కింద రెండవ భర్త, జిమ్ ట్రైనర్ అయిన నవీన్ కుమార్ (33) మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
దీంతో కోపోద్రిక్తులైన యువిక, లవర్ గా మారి తన సవతి తండ్రి నవీన్‌తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో అర్చన అడ్డు తొలగించాలని యువికారెడ్డి నిర్ణయించుకుంది. దీనికోసం సవతి తండ్రి కమ్ లవర్ తో కలిసి ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
గూండాలను పంపిన అర్చనా రెడ్డి...
కూతురితో కలిసి జీవిస్తున్న తన రెండో భర్తకు, కూతురిని బెదిరించడానికి అర్చనారెడ్డి గూండాల సాయం తీసుకుంది. జిగానిలోని మధుమిత్ర లేఅవుట్‌లో ఉంటున్న యువికా ఇంటికి గూండాలను పంపి బెదిరించింది. యువికతో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని నవీన్‌ను గూండాలు హెచ్చరించారు. యువికను ఆమె తల్లి వద్దకు తిరిగి పంపించాలి’’ అని వారు అతన్ని బెదిరించారు.
దీంతో యువిక వీలైనంత త్వరగా తన ప్లాన్ అమలు చేయాలని నిశ్చయించుకుంది. అయితే అర్చన రెండో భర్త నవీన్... ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత యువికను పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నట్లు గూండాలకు చెప్పినట్లు సమాచారం. ఈ సంఘటన తరువాత.. తమ ప్లాన్ ను అమల్లో పెట్టారు.. నవీన్, యువికాలు.. దీంట్లో భాగంగానే అర్చన వస్తున్న టయోటా ఇన్నోవాపై మెరుపుదాడి చేసి నరికి చంపారు. దీనికి నవీన్ కుమార్ కు అతని స్నేహితుడు కసువనహళ్లి సంతోష్ సహాయపడ్డాడు. వీరిద్దరినీ బుధవారం అరెస్టు చేయగా, యువికతో పాటు మరో నలుగురు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు.
సీన్ రివర్స్.. అత్యాచారం కేసు పెట్టిన యువతినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే...
యువిక, ఆమె 16 ఏళ్ల సోదరుడు అర్చనకు మొదటి వివాహం వల్ల కలిగిన సంతానం. నవీన్, యువికా ఇద్దరూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డవాళ్లే. కరోనా కారణంగా నవీన్ ట్రైనర్ గా పనిచేస్తున్న జిమ్ లో మూత పడడంతో అతని ఆదాయానికి గండి పడింది. దీంతో వీరిద్దరికీ ప్రధాన ఆదాయ వనరు అర్చనానే.
ఇక అర్చన కూతురు యువికాకు మోడల్ కావాలని కోరిక. దీనికి సాయం చేస్తానని నవీన్ వాగ్ధానం చేశారు. ఈ మేరకు 2020లో ఆమెకు ఫిట్‌నెస్ శిక్షణను ప్రారంభించాడు నవీన్. లాక్‌డౌన్ కారణంగా జిమ్ లు మూతపడడంతో ట్రైనింగ్ ఇంట్లోనే కొనసాగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అదే సమయంలో అర్చన, నవీన్ ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదాయం లేకపోవడం వల్ల అర్చన పేరుమీదున్న కొన్నింటిని తన పేరు మీదికి మార్చాలని నవీన్ ఒత్తిడి తేవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.
2021 మధ్యలో నవీన్, యువిక వ్యవహారం గురించి అర్చనకు తెలిసింది. దీంతో అర్చన విపరీతమైన కోపానికి వచ్చింది.. సవతి తండ్రితో సంబంధాన్ని కొనసాగిస్తే, పూర్వీకుల ఆస్తిలో వాటా ఇవ్వనంటూ కుమార్తెను హెచ్చరించింది. దీంతో యువిక, లవర్ గా మారిన సవతి తండ్రితో కలిసి బైటికి వచ్చేసి విడిగా ఉండడం మొదలుపెట్టారని పోలీసులు తెలిపారు. జిగానిలో అర్చన దివంగత తండ్రికి దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన భూమి ఉంది.