కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ లో స్థాపించిన పార్టీ పేరును ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు సోమవారం లేఖ రాశారు. 

కాంగ్రెస్ మాజీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల స్థాపించిన తన పార్టీ పేరును మార్చారు. ఈ మేరకు ఆయన పబ్లిక్ నోటీసు జారీ చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ గా ఉన్న పేరును ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీగా మార్చాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ను కోరారు.

దారుణం.. బర్త్ డే వేడుకల్లో యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం..

కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఆయన ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన సొంత పార్టీకి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 26, 2022న తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని నామకరణం చేశారు. తన పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుందని ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ఆయన హైకమాండ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఘోర పరాజయానికి రాహుల్ గాంధీయే కారణమని విమర్శించారు. రాజీనామా చేయడానికి ముందు ఆజాద్ సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. పార్టీ ఎన్నికల ప్రక్రియను కూడా ఆయన విమర్శించారు. అయితే ఆజాద్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌తో పాటు దాదాపు 20 మందికి పైగా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి.. పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం.. పిటిషనర్ కు చురకలు ..

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఆజాద్ కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2014లో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితుడయ్యారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జితేంద్ర అవద్.. ఎందుకంటే ?

అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆజాద్ కాంగ్రెస్ లో ఉండకపోవడం వల్ల ఆ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఆజాద్ జీ 23 నాయకులకు నాయకత్వం వహించారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఈ జీ 23 నాయకులు సోనియా గాంధీకి లేఖలు రాశారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు.