Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దుకు గులాం నబీ ఆజాద్ ఓటేశారు - జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ ఆరోపణ‌

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ మద్దతు ఇచ్చారని జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ ఆరోపించారు. పార్లమెంట్ లో కూడా ఆర్టికల్ రద్దు చేసేందుకు అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. 

Ghulam Nabi Azad voted for abrogation of Article 370 - Jammu Kashmir Apni Party president Altaf Bukhari alleges
Author
First Published Sep 3, 2022, 12:52 PM IST

ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ మద్దతు ఇచ్చార‌ని జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న శ్రీన‌గ‌ర్ లో మీడియాతో మాట్లాడుతూ అజాద్ పై విమ‌ర్శ‌లు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆజాద్ కొత్త పార్టీపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370ని పార్లమెంట్‌లో ఆజాద్ సమర్థించినా దాని రద్దుకే ఓటేశార‌ని అన్నారు.

వార్నీ.. ఎస్క‌లేట‌ర్ ను కన్వేయర్ బెల్ట్‌గా వాడిన మహిళలు.. ఒక‌రు మృతి.. ఎలాగంటే ?

‘‘ ఆజాద్ సాహబ్ ఆర్టికల్ 370 రద్దుకు ఓటు వేశారనే నిజం చెప్పనివ్వండి ’’ అంటూ బుఖారీ కామెంట్స్ చేశారు. నిజం మాట్లాడటం నేరమైతే తాను నేర‌మే చేస్తున్నాన‌ని అన్ఆరు. అజాద్ పార్లమెంటులో ఆర్టిక‌ల్ 370 రద్దుకే ఓటు వేశారు.  తమ పార్టీ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, భూములు సాధించిపెట్టిందని, ఇప్పుడు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని బుఖారీ అన్నారు.

‘‘ మా ప్రతినిధి బృందం త్వరలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుస్తుంది. రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని అధికారికంగా డిమాండ్ చేస్తుంది. మేము ఈ డిమాండ్‌ను కేంద్రపాలిత ప్రాంతం అంతటా ఉన్న జిల్లాల్లోని న్యాయాధికారుల ముందు కూడా ఉంచుతాము ’’ అని ఆయన చెప్పారు. 

కాగా.. దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం క‌లిగి ఉన్న 73 ఏళ్ల ఆజాద్.. ఇటీవ‌లే పార్టీని వీడారు. యూపీఏ ప్రభుత్వ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిన రిమోట్ కంట్రోల్ మోడల్‌ను పార్టీకి అన్వ‌యించినందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆమెను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. సోనియా గాంధీ కేవలం నామమాత్రపు వ్యక్తి అని, అన్ని ముఖ్యమైన నిర్ణయాలను రాహుల్ తీసుకుంటున్నారని, లేక‌పోతే ఆయ‌న సెక్యూరిటీ గార్డులు, పీఏలు మ‌రింత దారుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

అండమాన్ నికోబార్ దీవుల్లో మ‌రోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జ‌నం..

కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపిన ఐదు పేజీల రాజీనామా లేఖలో ఆజాద్.. భారీ హృదయంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ కంటే ముందే ‘కాంగ్రెస్ జోజో యాత్ర’ చేపట్టాల్సి ఉందని అన్నారు. అలాగే ఈ లేఖ‌లో రాహుల్ గాంధీ ప్రవర్తనను నిందించారు.పార్టీలో ఏ స్థాయిలోనూ ఎన్నికలు జరగలేదని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్‌ తన సంకల్పాన్ని, పోరాట పటిమను కోల్పోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అన్నారు.

జార్ఖండ్ లో రాజ‌కీయ క‌ల‌క‌లం.. బీజేపీ ఎంపీలు దూబే, మనోజ్ తివారీపై కేసు న‌మోదు.. ఏం జ‌రిగిందంటే..?

ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘జీ23’ గ్రూపులో ముఖ్యమైన సభ్యుడిగా ఉండేవారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన త‌రువాత జమ్మూకశ్మీర్‌లో జాతీయ స్థాయి పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ కు చెందిన ప‌లువురు నాయ‌కులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆజాద్ చెంత‌కు చేరారు. ఆజాద్ సెప్టెంబర్ 4వ తేదీన జమ్మూలో తన మొదటి ర్యాలీని నిర్వహించబోతున్నారు. అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘డ్రాన్ పర్ హల్లా బోల్’ కార్యక్రమం చేపట్టనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios