Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. ఎస్క‌లేట‌ర్ ను కన్వేయర్ బెల్ట్‌గా వాడిన మహిళలు.. ఒక‌రు మృతి.. ఎలాగంటే ?

ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ ను నిర్లక్ష్యంగా వాడటంతో మరో మహిళ చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో రెడ్టిట్ లో పోస్ట్ అయ్యింది. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. 

Women who used the escalator as a conveyor belt.. one died.. how?
Author
First Published Sep 3, 2022, 11:53 AM IST

సాధార‌ణంగా ఎస్క‌లేట‌ర్ ఎలా ఉప‌యోగిస్తారు. ఒక ఫ్లోర్ నుంచి మ‌రో ఫ్లోర్ కు ఎక్క‌డానికి, దిగ‌డానికి వాడుతారు. కానీ ఇద్దరు మహిళలు దానిని క‌న్వేయ‌ర్ బెల్ట్ గా వాడారు. దీని ఫ‌లితం ఏంటో తెలిస్తే మీరు క‌చ్చితంగా దిగ్భ్రాంతికి గుర‌వుతారు. ఎస్క‌లేట‌ర్ ను నిర్లక్ష్యంగా వాడ‌టంతో ఒక‌రి ప్రాణాలు పోయాయి. ఇవి దాదాపుగా షాపింగ్ మాల్స్ లో, ఎయిర్ పోర్టుల్లో, రైల్వే స్టేష‌న్స్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగిస్తే మ‌న శ్ర‌మ‌ను ఎంతో త‌గ్గిస్తాయి. కానీ ఇలా కేర్ లెస్ గా ఉప‌యోగిస్తే ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చెప్పేందుకు ఈ ఘ‌ట‌నే ఉదాహర‌ణ‌. 

ఇంట్లో నిధి... తవ్వి చూస్తే 264బంగారు నాణేలు...!

ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ఓ వీడియో ‘రెడ్డిట్’ లో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు స్త్రీలు తమ సూట్ కేసుల‌ను ప‌ట్టుకొని న‌డుస్తుంటారు. అయితే ఎస్క‌లేట‌ర్ కు ద‌గ్గ‌రికి చేరుకుని త‌మ సూట్ కేసుల‌ను పై నుంచి దానిపై వ‌దిలిపెడ‌తారు. దీంతో అది కింద‌కి వెళ్తుంది. కొంత దూరం వెళ్లిన త‌రువాత అది బోర్లా ప‌డుతూ వేగంగా కిందికి జారుతుంది. అదే స‌మ‌యంలో కింద ఓ మ‌హిళ ఎస్క‌లేట‌ర్ పై వెళ్తూ ఉంటుంది.

స్నేహితురాలి చెప్పుడు మాటలు విని భార్య దారుణ హత్య, వీడియో తీసి.. చివరికి..

ఈ సూట్ కేసు పై నుంచి వేగంగా రావ‌డం చూసిన ఆమె దాని నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప‌రిగెత్తాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ అత్యంత వేగంగా వ‌చ్చిన ఆ సూట్ కేసు ఆమె కాళ్ల‌ను బ‌లంగా తాకుతుంది. దీంతో ఆమె కాళ్లు బ్యాలెన్స్ కోల్పొయి పైకి లేచి కింద‌ప‌డుతుంది. దీంతో ఆమెకు అప‌స్మార‌క స్థితికి చేరుకుంటుంది. వెంట‌నే అక్క‌డున్న సిబ్బంది ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్తారు. ఈ వీడియో ఇప్పుడు ‘రెడ్డిట్’లో వైరల్ గా మారింది. 

ఓ యూజ‌ర్ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ.. ‘‘ ఇంకా కొంచెం అయితే ఆ మ‌హిళ నేల‌పై అడుగుపెట్టేది. కానీ ఆలోపే ఈ దారుణం జ‌రిగింది.’’ అని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన మహిళలను ప్రస్తావిస్తూ మ‌రో యూజ‌ర్ ఇలా కామెంట్ చేశారు. ‘‘ ఆ మహిళల వద్ద రెండు బ్యాగులు ఉన్నాయి. వారు అనుకుంటే ఖచ్చితంగా వాటిని పట్టుకొని ఎస్కలేటర్ పై నిలబడి ఉండ‌వ‌చ్చు ’’ అని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios