CSD Bipin Rawat: త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)పై విచార‌వణ జ‌రుపుగున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ ముగియడంతో అధికారులు త‌మ నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు.  

General Rawat Helicopter Crash Report: భార‌త దేశ మొట్ట‌మొద‌టి త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది గతేడాది డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ట్రై-సర్వీసెస్‌ విచారణ చేప‌ట్టింది. దీనికి సంబంధించిన విచార‌ణ పూర్త‌యింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించింది. ఈ ప్ర‌మాదానికి జ‌ర‌గ‌డానికి గ‌త పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు దీనిపై ఏర్ప‌డిన క‌మిటీ సమర్పించింది. అయితే, సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించి హెలికాప్టర్ ప్ర‌మాదానికి గురికావ‌డానికి వాతావ‌ర‌ణం ప్రతికూలంగా ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూలూరు నుంచి వెల్లింగ్‌టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌లో చిఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, మరో 12 మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.

Also Read: Caste: Assembly Elections2022: కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. యూపీలో ర్యాలీలు రద్దు.. ఎందుకంటే?

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రిపిన‌ బృందం అందించిన నివేదిక వివ‌రాల ప్రకారం Mi-17V5 ఛాపర్‌కు పైలట్‌గా ఉన్న వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, ప్రమాదానికి 8 నిమిషాల ముందు హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అతను హెలికాప్టర్‌ను తక్కువ ఎత్తులోకి చేరుకుందని పైలట్ వెల్లడించించాడు. భూ ఉపరితలం నుండి 500-600 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపాడు. అయితే అప్పటికే హెలికాప్టర్‌ను మేఘాలు కమ్మేయడం వల్ల దారి కనిపించలేదని తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అప్ర‌మ‌త్త‌మై... వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ రైల్వే లైన్‌ను అనుసరిస్తూ హెలికాప్టర్‌ను పైలట్ చేస్తున్నాడని.. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జనరల్ రావత్ ఉపన్యాసం ఇవ్వవలసి ఉందని నివేదిక పేర్కొంది. క్రాష్‌కు 8 నిమిషాల ముందు చివరి కమ్యూనికేషన్ రికార్డ్ చేయబడింది.హెలికాప్టర్ కూలిపోవడానికి ఎలాంటి ఇతర కారణాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

Also Read: Caste: పాఠశాలలో కుల విభజన.. ఏపీలో ఘటన... సర్వత్రా ఆగ్రహం

IAF హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగలేదని నివేదికలు సూచిస్తున్నాయి. హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ రైల్వే లైన్‌ను అనుసరిస్తుండగా, అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు రావ‌డం కూడా ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది. హెలికాప్టర్ మొత్తం సిబ్బంది అత్యంత అర్హత కలిగి ఉన్నారు. మానవ తప్పిదం లేదా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండటంతో సహా క్రాష్‌కు సంబంధించిన అన్ని దృశ్యాలను దర్యాప్తు బృందం పరిశీలించింది. కాగా, CDSతో పాటు, అతని భార్య మధులిక, అతని రక్షణ సలహాదారు బ్రిగ్ LS లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారు. ఇదిలావుండ‌గా, జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ పర్యటన ప్రమాదానికి ముందు కొన్ని గంటల ముందు రావత్ మాట్లాడారు. నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను అంటూ చెప్పారు.

Also Read: Coronavirus: డెల్టా మాదిరిగానే ఒమిక్రాన్ పంజా.. జ‌న‌వ‌రిలోనే పీక్ స్టేజ్ !.. ఆంక్ష‌లు ఆప‌లేవు !