Caste: పాఠశాలలో కుల విభజన.. ఏపీలో ఘటన... సర్వత్రా ఆగ్రహం

Caste:స‌మాజంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న కులం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రావ‌డం లేదు. ఇప్ప‌టికీ కులాల పేరుతో కొట్టుకు చ‌స్తున్న ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏకంగా అధికారులే ప్ర‌భుత్వ బ‌డిలో కుల విభ‌జ‌న  చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఓ ప్రభుత్వ బ‌డిలో విద్యార్థుల‌ను కులాల వారీగా విభ‌జించి.. పాఠాలు చెబుతున్నారు. 
 

Andhra Pradesh school denies lower caste students entry into new building, faces flak

Caste:కాలంతో ప‌రుగులు పెడుతూ మాన‌వుడు అనేక సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు. అంతులేని విజ్ఞానంతో ముందుకు సాగుతూ.. అంత‌రిక్షంలో ఇండ్లు క‌ట్టుకునే స్థాయికి ఎదిగాడు. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు.  అయితే, ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు. సాధరణంగా అంటరానితనం అమానుషం.. అంటరానితనాన్ని పాటించడం నేరం అయితే ఇవన్నీ కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. ఇంకా కులం పిచ్చి (Caste Discrimination) ముదిరిపోతున్న‌ది. మ‌నుషుల మ‌ధ్య విభ‌జ‌న రేఖ‌లు గీస్తూ.. కుల గ‌జ్జి పేర‌టి ఇప్ప‌టికీ కొట్టుకు చ‌స్తున్నాడు. అంద‌రూ స‌మాన‌మే అని చెప్పాల్సిన చోట‌.. భావి త‌రాల‌కు విద్యాబుద్దులు నేర్పి.. మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన చోట కూడా కుల పిచ్చి రాజ్య‌మేల‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏకంగా ప్ర‌భుత్వ అదికారులే కులం పేరిట పాఠ‌శాల‌ను విభ‌జించారు. వేరు వేరు కులాల‌కు చెందిన విద్యార్థుల‌ను వేరు వేరుగా కూర్చోబెడుతూ చ‌దువులు చెబుతున్నారు. చిన్నారి మ‌న‌స్సు కుల విజ‌భ‌న‌ను నాటుతున్న ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది.

Also Read: Coronavirus: డెల్టా మాదిరిగానే ఒమిక్రాన్ పంజా.. జ‌న‌వ‌రిలోనే పీక్ స్టేజ్ !.. ఆంక్ష‌లు ఆప‌లేవు !

వివ‌రాల్లోకెళ్తే.. పాఠ‌శాల‌లో కుల విభ‌జ‌న సృష్టించారు. ఉపాధ్యాయులు, అధికారులు సైతం దీని గురించి తెలిసి కూడా ప‌ట్టించుకోలేదు. విద్యార్థుల‌ను కులాల వారిగా వేరు వేరు బిల్డింగుల్లో కూర్చోబెట్టిన.. ఆ ప‌సి మ‌న‌స్స‌లో కుల గ‌జ్జి విషం నాటుకుపోయే విధంగా ప్ర‌భుత్వ అధికారులే న‌డుచుకున్నారు. ఈ విష‌యం తెలిసిన విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావ‌రి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాగా రాజకీయ చైతన్యం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో అక్క‌డ కుల గ‌జ్జి (Caste Discrimination) ఏ స్థాయిలో రాజ్య‌మేలుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.  రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కులవివక్ష విషయం కలకలం రేగింది. అగ్నికుల క్షత్రియ విద్యార్థులందరికీ ఒక పాఠశాల.. మిగతా విద్యార్థులందరికీ మరో పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త‌ల‌కు దారి తీసింది.  అగ్నికుల క్షత్రియుల సంఘాలు సైతం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.  అక్క‌డి పాఠ‌శాల ఉపాధ్యాయులు, మండ‌ల అధికారులు న‌డుచుకున్న తీరుపైన స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ సర్పంచ్‌ సూచనల మేరకు విద్యార్థులను కుల విభజన చేశారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Also Read: Coronavirus: కోవిడ్ నిధుల వినియోగంలో వెనుక‌బ‌డ్డ ఈశాన్య రాష్ట్రాలు.. టాప్‌లో ఢిల్లీ, త‌మిళ‌నాడు

బ్రహ్మపురిలో మొత్తం 52 మంది విద్యార్థులతో ఈ ప్రాథమిక పాఠశాల కొనసాగేది. అయితే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 9 లక్షలతో.. ఈ స్కూలుకు అప్‌గ్రేడ్ చేసింది. దీనిలో భాగంగా అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పించారు. కొత్త‌గా తీర్చిదిద్దారు. ఇక్క‌డే కుల గ‌జ్జి రాజుకుంది.  అన్ని వసతులు ఉన్న బిల్డింగ్ లో అగ్ర వర్ణాల వారిని.. వసతులు తక్కువగా ఉన్న స్కూలును అగ్ని కుల క్షత్రియులను వేరే స్కూల్లో ఉంచారు. విష‌యం  తెలిసిన త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎలాంటి సదుపాయాలు లేని స్కూల్‌కు 26 మంది విద్యార్థులను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చ‌ర్య‌ల‌ను మానుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఒకే పాఠ‌శాల‌ను ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, అంద‌రికీ స‌మానంగా విద్య‌ను అందిచాల‌ని అంటున్నారు. ప‌సి మ‌న‌స్స‌ల్లో కుల గ‌జ్జిని (Caste Discrimination) నింపొద్ద‌ని అంటున్నారు.  ఈ విష‌యం గురించి క‌లెక్ట‌ర్ కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. 

Also Read: Coronavirus: క‌రోనాకు మ‌రో కొత్త మందు.. వ‌చ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios