పాకిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఆ చదువులకు దూరంగా పారిపోవాలని అనుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతం నుంచి సరిహద్దు వైపుగా పారిపోయి వచ్చాడు. కానీ, ఇంకొంత ముందుకు రావడంతో భారత భూభాగంలోకి వచ్చాడు. భారత ఆర్మీ అతడిని పట్టుకుంది. 

న్యూఢిల్లీ: పదో తరగతి బలవంతంగా చదువుతున్న ఆ బాలుడు ఇక తనతో కాదని అనుకున్నాడు. బోధించే చోటు నుంచి దూరంగా పారిపోవాలని అనుకున్నాడు. దేశ సరిహద్దు వైపు పారిపోయాడు. 19 ఏళ్ల జుల్కర్ నయిన్ అనుకోకుండా భారత భూభాగంలోకి వచ్చాడు. భారత ఆర్మీ ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంది.

పాకిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల జుల్కర్ నయిన్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఓ మదర్సాలో తన విద్యార్జన కొనసాగుతున్నదని ఆ యువకుడు చెప్పాడు. అయితే, ఆ చదువుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయం తీసుకున్నా అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సరిహద్దు వైపుగా పారిపోయి వచ్చినట్టు వివరించాడు. అయితే, అక్కడ ప్రమాద వశాత్తు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు చెప్పాడు.

పాకిస్తాన్‌తో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొచ్చుకెళ్లి వచ్చిన ఆ పాకిస్తాన విద్యార్థిని చక్ రాందాస్ బార్డర్ వద్దు భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ప్రొటోకాల్ ఆఫీసర్ అరుణ్ మహల్ ఈ ఘటన గురించి మాట్లాడారు. ఆ యువకుడిని తిరిగి పాకిస్తాన్ రేంజర్లకు అప్పగిస్తామని వివరించారు. 

Also Read: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు!

భారత ఆర్మీ ఆ యువకుడిని పాకిస్తాన్‌కు పంపించే యోచనలో ఉన్నది. భారత ఆర్మీ అరుణ్ మహాల్ మాట్లాడుతూ, మనం త్వరలోనే ఆ యువడికుడిని పాకిస్తాన్ రేంజర్లకు అప్పగిస్తామని వివరించారు. తాను మళ్లీ స్వదేశం వెళ్లుతున్నాననే మాట సంతోషంగా ఉన్నదని నయిన్ తెలిపారు. 

జుల్కర్ నయిన్ కొంత కాలం భారత జైలులో గడపాల్సి వచ్చింది. ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు అతడిని తిరిగి పంపించాలనే నిర్ణయం వచ్చింది.