పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శవపరీక్షలో ఆమె గర్భవతి అని, గ్రామంలోని ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తేలింది.
ఉత్తరప్రదేశ్ : 20 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని నదిలో విసిరేశాడో కిరాతక తండ్రి. ఆ వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
మహుదీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెటిమ్‌పూర్ మథియా గ్రామానికి చెందిన కాజల్ మృతదేహం ఏప్రిల్ 2న ఛోటీ గండక్ నదిలో లభ్యమైందని పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. కొన్ని రోజులుగా ఆమె కనిపించకుండా పోయిందని శర్మ తెలిపారు.
పోస్టుమార్టం పరీక్షలో ఆమె గర్భవతి అని తేలిందని పోలీసులు తెలిపారు. కాగా, గ్రామంలోని ఓ యువకుడితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, ఎవరో ఆమె తండ్రి నౌషాద్‌కు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఈ వార్తలతో కలత చెందిన నౌషాద్ కాజల్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఛోటీ గండక్ నదిలో విసిరినట్లు పోలీసులు తెలిపారు.
చదవలేక పారిపోయాడు.. సరిహద్దు దాటి పాక్ నుంచి ఇండియాలో అడుగుపెట్టాడు.. తర్వాత ఏం జరిగిందంటే?
సంఘటనకు ముందు నౌషాద్ తమందరినీ మతపరమైన ప్రదేశానికి పంపించాడని నిందితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారని ఎస్పీ తెలిపారు. ఆ తరువాత ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులతో అతను తన కుమార్తె తప్పిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత కూతురును వెతకడంలో కూడా సాయపడ్డాడు. చివరికి మృతదేహం దొరకడంతో.. అనుమానంతో విచారించగా అతను నిజం ఒప్పుకున్నాడని అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బియ్యం బస్తాలో కుక్కారు. ఆ బస్తాను నదిలో పడేశారు. అయితే, ఆమె మృతదేహం నది ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో ఘటన వెలుగు చూసింది. ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. యువతి ఒక యువకుడితో ప్రేమలో ఉందని ఆ వ్యవహారం నచ్చకే కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మృతురాలైన యువతి మేనమామ, తండ్రి, సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఖుషి నగర్ జిల్లాలోని బూఢీ గంఢక్ నదిని ఆనుకుని నర్వాజ్యోత్ డ్యామ్ ను నిర్మించారు. కాగా.. ఈ డ్యాముకు దగ్గరలో ఓ యువతి మృతదేహం దొరికింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తులో ఆ యువతి గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పరువు హత్యగా అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.యువతి తండ్రి, సోదరుడు, మేనమామలతో పాటు.. చనిపోయిన యువతి కుటుంబంలోని మహిళలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని.. తీవ్రతను బట్టి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ జిల్లా ఎస్పీ రితేష్ కుమార్ సింగ్ తెలిపారు.
