Asianet News TeluguAsianet News Telugu

అప్ర‌మ‌త్త‌మైన గాంబియా ప్ర‌భుత్వం,, ఇంటింటికి తిరుగుతూ  సిర‌ప్ ల రీకాల్ 

గాంబియాలో దగ్గు, జలుబు సిరప్ ల వినియోగంతో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత సిరప్‌లను అత్యవసరంగా రీకాల్‌ చేసింది.

Gambia urgently recalls syrups blamed for 66 child deaths
Author
First Published Oct 7, 2022, 1:22 AM IST

పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు సిరప్ ల వ‌ల్ల‌ 60 మందికి పైగా చిన్నారుల మరణించిన విష‌యం తెలిసిందే. భారత దేశంలోని ఓ పార్మా కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశ ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. సంబంధిత సిర‌ప్ ల‌ను రీకాల్ చేసింది.  ఇంటింటికి తిరుగుతూ.. అధికారులు వాటిని వెన‌క్కి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌ డైరెక్టర్‌ నరేశ్‌ కుమార్‌ గోయల్  మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారుల మృతికి సంబంధించిన  సమాచారం గ‌రువారం ఉద‌యం అందిన‌ట్టు తెలిపారు. అస‌లూ ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్ర‌యత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో తమ ఉత్పత్తులు అమ్మకాలు  లేవ‌ని అన్నారు.  కారణమైన దగ్గు సిరప్ నమూనాలను పరీక్ష కోసం పంపారు. ఈ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఆఫ్రికా దేశమైన గాంబియా(Gambia)లో దగ్గు, జలుబు సిరప్‌(Syrup)ల వినియోగంతో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. 

కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌ట‌న 

గాంబియాలో చిన్నారుల మరణానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా సమాధానం ఇచ్చింది. ఆ ప్ర‌మాద‌క‌ర ఆ నాలుగు దగ్గు సిరప్‌లను భారతదేశంలో ఎక్కడా విక్రయించలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్పాదక సంస్థకు ఈ ఉత్పత్తుల ఎగుమతి హక్కు మాత్రమే ఉందని తెలిపింది. 

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) ప్రాథమిక దర్యాప్తులో మైడెన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ హర్యానా ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సిరప్‌లను తయారు చేసే హక్కులను కలిగి ఉంది. కానీ ఈ ఉత్పత్తుల‌ను భార‌త్ లో విక్ర‌యించ‌డానికి అనుమతి లేద‌ని  లిపింది. కంపెనీ నుండి నమూనాల‌ను సేకరించ‌బ‌డ్డాయ‌నీ, వాటిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. దాని నివేదిక త్వరలో రానున్న‌దని తెలిపారు. 

WHO ఏం చెప్పింది?

WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, గాంబియాలో గుర్తించిన నాలుగు ఔషధాలపై  నిషేధం విధిస్తూ..  WHO హెచ్చరిక జారీ చేసింది, ఆ  సిర‌ప్ ల వ‌ల్ల 66 మంది పిల్లలు తీవ్రమైన కిడ్నీ దెబ్బతినడం వల్ల చనిపోతారని తెలిపింది. ఆ సిర‌ప్ ల‌ను  ఉత్పత్తి చేసిన సంస్థ వివ‌రాలు తెలిపాలని WHO తెలిపింది. అలాగే.. ఇత‌ర దేశాల‌కు వాటి పంపిణీ చేసింద‌నే వివ‌రాల‌ను కోరింది.  

గాంబియాకు చెందిన మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కూడా హెచ్చరిక జారీ చేసింది. కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.  గుర్తించిన మందుల్లో కిడ్నీలకు కోలుకోలేని విధంగా హాని కలిగించే విషపూరిత పదార్థాలు తగినంత పరిమాణంలో ఉన్నట్లు తేలిందని కౌన్సిల్ తెలిపింది. భారత ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా కలుషిత ఔషధం గురించి దర్యాప్తు చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios