G20 Summit: ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు
G20 Summit: మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మూడు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని తన నివాసంలో మూడు ద్వైపాక్షిక స మావేశాలు జరగనున్నాయని ప్రధాని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.

G20 India 2023: భారత్ ఆతిథ్యమిస్తున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని పాలం టెక్నికల్ ఏరియాలో ఆమెకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ స్వాగతం పలికారు. భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు లోతైన చారిత్రక, భాషా, సాంస్కృతిక, ఇతర సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది ప్రాంతీయ-అంతర్జాతీయ ద్వైపాక్షిక సంబంధాలకు ఒక నమూనాగా ఉంది. 1971 లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని గుర్తించిన మొదటి దేశం భారతదేశం. ఆ వెంటనే దౌత్య సంబంధాలను స్థాపించింది. రెండు దేశాలు బలమైన నాగరిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా భారత్- బంగ్లాదేశ్ మధ్య రక్షణ సహకారం, ద్వైపాక్షిక విన్యాసాలను పెంపొందించడంపై ఇటీవల చర్చలు జరిగాయి.
కాగా, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మూడు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని తన నివాసంలో మూడు ద్వైపాక్షిక స మావేశాలు జరగనున్నాయని ప్రధాని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ దేశాలతో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు అవకాశం ఇస్తాయని కూడా మోడీ అన్నారు.