Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: ఓటు విలువ, అనువాదంతో తలనొప్పి, రాయల్టీ వర్సెస్ లాయల్టీ..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తెరవెనక జరుగుతున్న కొన్ని సంగతులను తాజా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.. 
 

from the india gate from lost in translation and tableau at the Republic Day Parade to royalty vs loyalty
Author
First Published Jan 23, 2023, 9:13 AM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓటు విలువ..
ఒకప్పుడు హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆశీస్సులు, మద్దతు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ సిఫార్సులతోనే ఆయన రాజ్యసభ వచ్చిందని భావించేవారు కూడా ఉన్నారు. గిరిజన సమాజానికి చెందిన ఈ యువ ముఖం పొలిటికల్ కేరీర్ ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్‌లో ఉంది. ఆదర్శప్రాయమైన వాగ్ధాటి, నాయకత్వ నైపుణ్యాలు కలిగిన ఆయనపై ప్రధాని నరేంద్ర మోదీకి మంచి అభిప్రాయం ఉందని నమ్ముతారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండనుందనే ప్రచారం.. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో ఆయనను కేబినెట్ బెర్త్ ఇచ్చే అంశాన్ని ప్రధాని మోదీ పరిశీలించవచ్చనే భారీ ఊహాగానాలు ఉన్నాయి. ఇక, ఈ నాయకుడి ములాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయన ఆదివాసీల ప్రాబల్యం ఉన్న పశ్చిమ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా ప్రయోజనం చేకూర్చగలరనే అంచనాలు ఉన్నాయి. ఇక, రాష్ట్ర జనాభాలో కూడా 21 శాతానికి పైగా గిరిజన ఓటర్లు ఉన్నారు.

అనువాదంలో ఇబ్బందులు..
ఉత్తర భారత నేతల ప్రసంగాలను కన్నడలోకి అనువదించగల సామర్థ్యం ఉన్న నేతలు లేకపోవడం రెండు జాతీయ పార్టీలకు(బీజేపీ, కాంగ్రెస్‌)  ఇబ్బందికరంగా మారింది. రెండు పార్టీలలో కూడా ఇలాంటి సమస్య ఉండటం.. ఆయా పార్టీల అధినాయకత్వాలకు తలనొప్పిగా మారింది. ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆధారపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను నమ్ముకుంది. అయితే ఈ నేతలు హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఉద్వేగభరితంగా ప్రసంగిస్తుంటే.. అందులోని ఆత్మను ప్రజలకు అర్థమయ్యేలా అనువదించే నాయకులు ఆయా పార్టీలలో లేకుండా పోయారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

ప్రియాంక గాంధీ ఇటీవల కర్ణాటకలో ‘‘నా నాయకి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రియాంక ప్రసంగాన్ని అనువదించిన కర్ణాటకకు చెందిన ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీ హెబ్బాల్కర్..  అందులోని ఆత్మను, ఆకాంక్షలను ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. ఆమె అనువాదం తరుచుగా ప్రసంగం నుంచి పక్కకు జరిగింది. అదేవిధంగా.. భారత్ జోడో యాత్ర సమయంలో మొలకాల్మూర్, దావణగెరెలలో ధరమ్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, నాగరాజ్ యాదవ్‌లు రాహుల్ గాంధీ ప్రసంగాలను అనువదించారు. అయితే రాహుల్ ప్రసంగానికి భిన్నంగా వారు స్వంత ప్రసంగాలను ప్రారంభించారు. ఒకానొక సమయంలో రాహుల్ గాంధీ తన అసలు ప్రసంగాన్ని కాకుండా ఇతర విషయాలు చెబుతున్న తన అనువాదకున్ని పరిమితం చేయవలసి వచ్చింది.

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: కేబినెట్ విస్తరణపై ఆశలు, ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ, పేద పార్టీ.. ధనిక కార్యకర్తలు..

బీజేపీ విషయానికి వస్తే.. మాండ్యాలో అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీకి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారా? అని అమిత్ షా అక్కడి ప్రజలను అడిగారు. అయితే అనువాదం చేసిన నేత మాత్రం.. అక్కడి వారితో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం పొందారా? అని కన్నడలో అడిగారు. అయితే వెంటనే ఆయనను కేంద్ర హోం మంత్రి కంట్రోల్ చేశారు.

ఊహించని విధంగా..
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో తమ శకటాన్ని ప్రదర్శించాలని చూసినప్పుడు.. మంచి ఫలితం వస్తుందని భావించిన చివరలో మాత్రం ఊహించని పరిస్థితిని కేరళ ఎదుర్కొంటుంది. ఇటీవలి సంవత్సరాలలో రిపబ్లిక్ డే పరేడ్‌కు సంబంధించి శకటాల విషయంలో కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. గత ఏడాది కూడా సామాజిక సందేశం లేకపోవడంతో ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ హృదయానికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్‌ను సూచించడం ద్వారా కేరళ ట్రంప్ కార్డ్ ప్లే చేసినట్లు తెలుస్తోంది.

కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో కేరళ శకటం.. నారీ శక్తి అనేక కోణాలను ప్రదర్శించనుంది. కళరిపయట్టు, డ్రమ్స్‌తో పాటు.. ఈ శకటంలో గోత్ర కళామండలం కళాకారులు ఉంటారు. వారు పాలక్కాడ్ జిల్లాలోని అట్టపాడిలో గిరిజన పాటలు, నృత్య రూపాలను అందించనున్నారు. ఉత్తమ మహిళా గాత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం పొందిన నాంజియమ్మ ఈ కళామండలంకు సారథ్యం వహించనున్నారు.

ఇతర కళాకారులు కేరళ మహిళలు సాధికారతలో సాధించిన గొప్ప పురోగతిని ప్రతిబింబిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతగానో ఇష్టపడే ప్రాజెక్టులైన బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన, నారీ శక్తితో సత్సంబంధాలను కలిగి ఉన్నట్టుగా కనిపిస్తోంది.


మధ్యప్రదేశ్‌లో చివరిలో దిద్దుబాటు..
మధ్యప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశానికి ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ‘‘మామా జీ’’ శివరాజ్ సింగ్ చౌహాన్.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండొచ్చు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే.. బీజేపీ ఆరు-ఏడు మంది మంత్రులను వదిలివేసి.. కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త రూపాన్ని కలిగిన కేబినెట్‌తో ఎన్నికల సీజన్‌లోకి ప్రవేశించేందుకు కొత్త ముఖాలను పరిచయం చేసేందుకు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న కొందరిపై ఉన్న అధికార వ్యతిరేకతను తగ్గించడం కూడా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్థం అవుతుంది.


రాయల్టీ వర్సెస్ లాయల్టీ
రాయల్స్ రెడ్ కార్పెట్‌కి అలవాటు పడ్డారు. తరచుగా వారు పార్టీ కార్యకర్తలతో సఖ్యత కొనసాగించడం లేదు. రాయల్టీకి చెందిన ఒక సభ్యుడు బీజేపీలో చేరి అధికార కారిడార్‌లో ముఖ్యమైన స్థానాన్ని పొందినప్పటి నుంచి.. ఆయనపై, ఆయన క్యాడర్‌పై అవే ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సరం కూడా స్థానిక బీజేపీ క్యాడర్ తమ పట్ల అమర్యాదం ప్రవర్తించారని.. ‘‘గాలిలో ఎగిరే’’ ఆ నాయకునికి, ఆయన మద్దతుదారులకు వ్యతిరేకంగా పార్టీ ప్రధాన కార్యాలయానికి ఒక లేఖను రాయడం కూడా జరిగింది. అయితే ఆ విషయం గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయింది. అయితే ఇప్పుడు.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సీజన్‌ రావడంతో మరోసారి అసంతృప్తి రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కట్టుదిట్టంగా నడుస్తుందని భావిస్తున్నారు. లేకపోతే గందరగోళంలో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

బెయిల్ అవుట్..
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇతర పార్టీల మీద దుష్ప్రచారం చేయడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. రాజకీయ నాయకుల బంధువులను లాగడానికి కూడా ఎవరూ వెనుకాడటం లేదు. యూపీలోని చోటే నేతాజీ కనుగొన్నట్టుగా.. ఇందులో స్త్రీ, పరుషులు అనే తేడా కూడా లేకుండా పోయింది. ఈ సైబర్ పోరులో ఇటీవల ఓ మహిళ నాయకురాలు చోటే నేతాజీని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. ఈ చర్య ఓవైపు మంచి, మరోవైపు చెడును కలిగించే ప్రమాదం ఉందని చోటే నేతాజీ వెంటనే గ్రహించారు. మహిళా నాయకురాలిని అరెస్టు చేయవద్దని ఆయన వెంటనే పోలీసులకు సూచించారు.

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: ఆ రాష్ట్రాల్లో శాంతి పవనాలు, యూపీలో ఘర్ వాపసీ, సీనియర్ అధికారి ఆశలపై నీళ్లు..

అయితే అది రాజకీయ బలవంతం వల్లనే తప్ప నేతాజీ ఔదార్యం వల్ల కాదని ప్రజలకు తెలుసు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఒత్తిడి చేయడం వల్ల మహిళా నాయకురాలికి చెందిన నిర్దిష్ట ఓటు బ్యాంకు కోతకు గురవుతుందని చోటే నేతాజీకి జ్ఞానం వచ్చింది. మరోవైపు ఆ మహిళ చోటే నేతాజీ పార్టీ సోషల్ మీడియాలో ప్రారంభించిన దాడికి మాత్రమే ప్రతిదాడి చేసినట్టుగా ఆయనకు చెప్పబడింది. ఇలాంటి పరిస్థితుల వేళ సకాలంలో స్పందించి ఏదైనా చేసే పనిని ఆపడం(బెయిల్ అవుట్) కూడా రాజకీయ చర్యే.

డబుల్ డోస్ దురదృష్టం..
ఈ ఐపీఎస్ అధికారి కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఘటనల్లో చిక్కుకుని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. అయితే ఆ రెండు ఘటనలు కూడా దురదృష్టకరమైనే కావడం ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. తన పార్టీ సోషల్ మీడియా హెడ్‌ను అరెస్టు చేసిన తర్వాత పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. ఆ ఐపీఎస్ అధికారి ఇచ్చిన టీ ఆఫర్‌ను తిరస్కరించినప్పుడు ఆయన ముఖం వాడిపోయింది. ఈ తిరస్కరణ అందరి సమక్షంలోనే జరిగింది. 

ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఓ మీడియా వ్యక్తి పనిలో ఆ అధికారి జోక్యం చేసుకుంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. తన పనిని అడ్డుకోవడానికి సంబంధించి.. ఆ జర్నలిస్ట్ పోలీసు అధికారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ  అధికారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మీడియా ఆగ్రహం తగ్గింది. అయితే యూపీలో జరగనున్న కొన్ని పెద్ద ఈవెంట్‌లను దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios