Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: ఆ రాష్ట్రాల్లో శాంతి పవనాలు, యూపీలో ఘర్ వాపసీ, సీనియర్ అధికారి ఆశలపై నీళ్లు..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తెరవెనక జరుగుతున్న కొన్ని సంగతులను తాజా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.. 

From the India Gate from Peace has dawned in Bengal to Surname Circus in UP
Author
First Published Jan 10, 2023, 6:31 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు ఆదేశాలు.. 
పశ్చిమ బెంగాల్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్ బాధ్యతలు  చేపట్టిన తర్వాత.. గతంలో సుదీర్ఘ కాలం కొనసాగిన గవర్నర్ వర్సెస్ సీఎం పరిణామాలకు తెరపడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్  బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో.. రాజ్‌భవన్‌కు, సీఎం మమతా బెనర్జీకి అస్సలు పడేది కాదు. అయితే ప్రస్తుతానికైతే ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద్ బోస్ నియామకంపై మమతా బెనర్జీకి ప్రారంభంలో కొంత భయం ఉన్నప్పటికీ.. ‘‘అతను మంచి మనిషి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఓపెన్ మైండ్‌తో స్వీకరించారు. 

అయితే ఇక్కడ గవర్నర్‌కు మమతా నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో కేరళ ఆహారాన్ని ఆస్వాదించడం కొనసాగించమని గవర్నర్‌ను మమతా బెనర్జీ కోరారు. బెంగాలీ వంటకాలతో తాను పూర్తిగా ఆనందంగా ఉన్నానని ఆనంద బోస్ సమాధానమిచ్చిన సమయంలో.. మమతా బెనర్జీ ఈ మాట చెప్పారు. ‘‘ మేడమ్ (ఆనంద బోస్ భార్య) నేను ఏమి సూచిస్తున్నానో అర్థం చేసుకుంటున్నారు. మీరు కేరళ నుంచి ఒక వంటమనిషిని నియమించుకోవచ్చు. సంకోచించకండి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది’’ అని మమతా అన్నారు. 

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్‌: అందమైన ముఖం కోసం వేట, చోటే నేతాజీ జైలు సందర్శనలతో ఇబ్బందులు..

రెండోవది గవర్నర్ ప్రయాణానికి సంబంధించిన అంశం. ముఖ్యమంత్రి కోసం ఒక విమానాన్ని లీజుకు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విమానాన్ని వినియోగించుకోవచ్చని సీవీ ఆనంద బోస్‌తో జరిగిన తొలి సమావేశంలోనే మమత ప్రతిపాదించారు. ‘‘మీరు కేరళకు కూడా ప్రయాణించడానికి దీనిని ఉపయోగించవచ్చు’’ అని మమత చెప్పారు. అయితే గవర్నర్ ఇంకా అధికారికంగా ఈ ప్రతిపాదనను ఆమోదించలేదని పరిపాలనా వర్గాలు తెలిపాయి.

రాజ్‌భవన్, ప్రభుత్వం మధ్య బంధం స్నేహపూర్వకంగా ఉందని చాలా మంది భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. తుఫాన్‌కు ముందు ఉండే ప్రశాంత వాతావరనంగా దీనిని అభివర్ణిస్తున్నారు.

అరుపులు, కోపం వల్ల ఉపయోగమేమిటి..
గవర్నర్, ప్రభుత్వం మధ్య శాంతి తరంగాలు కేరళకు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా పొలిటికల్ థ్రిల్లర్‌ తలపించిన ఈ పరిణామాలు.. ఇప్పుడు టెన్షన్ క్లైమాక్స్ వైపు వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ సమస్య సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రివర్గంలో సాజీ చెరియన్‌ను తిరిగి నియమించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అంగీకరించడంతో శాంతి తరంగాలకు సంబంధించిన మొదటి సంకేతాలు కనిపించాయి. భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద ప్రసంగం కారణంగా సాజీ కొన్ని నెలల క్రితం కేబినెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే పోలీసు విచారణలో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. 

దీంతో ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని పినరయి విజయన్ భావించారు. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి న్యాయ అభిప్రాయానికి సూచించడం ద్వారా గవర్నర్ ఒక ట్విస్ట్ జోడించారు. అయితే లీగల్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆరీఫ్ ఖాన్.. ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ప్రతిస్పందించింది. తొలుత కేరళ  సర్కార్..  గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌ను కొనసాగింపుగానే.. రాబోయే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మంచు కరిగిపోవడంతో.. ఈ ఏడాది జరిగే తొలి సమావేశాలలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ సభను ఉద్దేశించి ప్రసంగించేలా ప్రభుత్వం అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించాలని  నిర్ణయం తీసుకుంది. ఇది ప్రశాంతంగా జరుగుతుందా లేక తమిళనాడు అసెంబ్లీలో సన్నివేశాలు పునరావృతమవుతాయా అనేది వేచిచూడాల్సి ఉంది. 

మంచే జరుగుతుందని అనుకున్నప్పటికీ..
అతి పెద్ద రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉండాలనే తన ఆశయంపై మంచి ఫలితమే వస్తుందని భావించిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి నిరాశే మిగిలింది. ఆ పదవిపై చాలా మంది సీనియర్ బ్యూరో‌క్రాట్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆ అధికారి నిరీక్షణ మాత్రం.. చాలా ఎక్కువగానే ఉండేది. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు కూడా చేశారు. అందరూ సీనియర్ నాయకుల దృష్టి తనపై ఉంచడానికి వారిని ఆకట్టుకోవాలని చూశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని ఏడాది పొడిగించడంతో ఆయన కలలన్నీ చెదిరిపోయాయి.

ఇంటిపేరు సర్కస్.. 
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఘర్ వాపసీ సీజన్ కనిపిస్తోంది. ఇటీవల సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్.. తన కుటుంబానికి, పార్టీకి తిరిగి దగ్గరయ్యారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక ప్రముఖ ఎంపీ కూడా ఈ బాటలోనే ప్రయాణించనున్నారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఆ ఎంపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే అందరి దృష్టి ఉంది. బీజేపీ నాయకత్వం, విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేయడం, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో ఆయనను కొన్నిసార్లు మందలించారు. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ఆ బీజేపీ ఎంపీ మళ్లీ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలోకి (కాంగ్రెస్‌) రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్‌: కోడళ్ల మధ్య పోరు, యాక్షన్‌లో ఆమె మిస్సింగ్, ట్రోఫిపై మ్యాప్ కథేంటి..

ఇందుకు సంబంధించి తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలోని తన కజిన్ సిస్టర్‌, ఒక సీనియర్ నాయకునితో చర్చలు జరిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తన నిష్క్రమణను కాషాయ పార్టీలోని చాలా మంది మంచి పరిణామం అని భావిస్తారనే సంగతిని ఆయన గ్రహించలేదు. ఎందుకంటే.. ఆయన ప్రముఖ ఇంటి పేరు కలిగి ఉండటంతో పలు సందర్భాల్లో ఆ పేరును వాడటం నేతలకు బాధగా మారిందనే టాక్ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios