ఫ్రమ్ ది ఇండియా గేట్: కేబినెట్ విస్తరణపై ఆశలు, ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీ, పేద పార్టీ.. ధనిక కార్యకర్తలు..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 8వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గెలుపు ఎవరిని వరిస్తుంది..
కేంద్రంతో పాటు కర్ణాటకలో కూడా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గం విషయానికి వస్తే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మరికొంత ప్రాతినిధ్యం కల్పించేలా విస్తరణ జరగనుందనే ప్రచారం ఉంది. అయితే కర్ణాటక నుంచి ఇప్పటికే నలుగురు ప్రముఖులు కేంద్ర మంత్రులుగా ఉన్నందున ఆ రాష్ట్రం నుంచి ఎవరూ కూడా కేంద్రంలో బెర్త్ ఆశించడం లేదు.
అయితే కర్ణాటకలో మాత్రం పిలుపు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇందులో శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర, కలబురగి ఎంపీ ఉమేష్ జాదవ్ ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో ఆధిపత్య లింగాయత వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రసన్నం చేసుకునేందుకు వారికి చోటు కల్పించే అంశం పరిగణించబడుతుంది. యడియూరప్పను శాంతింపజేసే లక్ష్యంతో.. ఆయన కుమారుడు బీవై రాఘవేంద్రకు కేబినెట్ బెర్త్ ఇవ్వడం అనేది రాజీ ఫార్ములాగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ లేదా సీపీ యోగేశ్వర్ కోసం కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: అందమైన ముఖం కోసం వేట, చోటే నేతాజీ జైలు సందర్శనలతో ఇబ్బందులు..
అయితే మరికొన్ని నెలల్లోనే కర్ణాటకలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో.. యడియూరప్ప అసంతృప్తిని ఆహ్వానించే ఏ చర్యను స్వాగతించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైకి చెప్పినట్లు తెలిసింది. మరి కర్ణాటక మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.
సిద్ద వైద్యం..
సాధారణంగా అగ్ర రాజకీయ నాయకులు వారికి, వారి బంధువులు సులువుగా విజయం సాధించేందుకు అనుకూలంగా ఉండే సీట్లు దక్కేలా తమ పలుకుబడిని ఉపయోగిస్తారు. కానీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్యకు తన కుమారుడు యతీంద్రపై ఉన్న ప్రేమ ప్రమాదకర రాజకీయ వ్యూహాలను ఎంచుకునే విధంగా చేస్తుంది. తాను బగలకోట్ జిల్లా బాదామి నుంచి పోటీ చేయనని షాకింగ్ ప్రకటన చేసిన సిద్ధరామయ్య.. ఆ తర్వాత తనకు ఇష్టమైన సీటు కోలార్ అని చెప్పడం ద్వారా మరింత హీట్‌ను పెంచారు.
వరుణ, బాదామి స్థానాల విషయానికి వస్తే.. వరుణ నుంచి సిద్ధరామయ్య చాలా సులభంగా గెలుస్తారు. బాదామి నుంచి కూడా ఆయన ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పార్టీ చేసిన సర్వేలు కోలార్‌ను ప్రమాదకర ప్రతిపాదనగా పేర్కొన్నాయి. అయితే సిద్ధ తన కుమారుడు యతీంద్రకు వరుణకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండోసారి పదవిని కట్టబెట్టాలనుకుంటున్నారు. అందుకే ఆయన కోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. బాదామి ఆయన స్వస్థలమైన మైసూర్ నుంచి చాలా దూరంలో ఉంది. అతనికి బంగారు హృదయం ఉందని మనకు తెలుసు.. అయితే అతను కోలార్‌లో (కోలార్ బంగారు గనులకు ప్రసిద్ది) బంగారు జాక్ పాట్ కొడతాడా లేదా అనేది చూడాలి.
భిన్నత్వంలో ఏకత్వం..
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు సభ ఒక్కటిగా నిలిచింది. అయితే నిరసన స్వరాల కేకలు అంతటా విజృంభించడంతో.. డీఎంకే నాయకత్వం ఆ ప్రదర్శనను అకస్మాత్తుగా ముగించింది. ఢిల్లీ ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు త్వరితగతిన యూ-టర్న్ తీసుకున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ నిరసన ద్వారా డీఎంకే పన్నుతున్న లోతైన వ్యూహం ఉంది. దక్షిణ భారతదేశంలో పార్టీని బలీయమైన శక్తిగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో.. డీఎంకే అన్ని ప్రతిపక్ష పార్టీలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 55 శాతం స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు ఫ్రంట్‌కు వెలుపల ఉన్న రెండు పార్టీలైన డీఎండీకే, పీఎంకేతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు అనేక స్థానాలను తెరిచింది. ఇది కాకుండా.. నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండటంతో డీఎంకే తన వ్యుహాన్ని మరింత సులువుగా అమలు చేసే అవకాశం ఉంది.
పొరుగువారి అసూయ..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తొలుత రాజకీయ ప్రవేశం చేయడానికి ప్రేరేపించినది ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీని బలహీనపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకే కేసీఆర్ ఈ పని చేస్తున్నట్టుగా కూడా ఓ వర్గంలో ప్రచారం సాగుతుంది. అయితే ఈ వ్యుహాంలో ఆయన విజయం సాధిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఏపీ నుంచి ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన రావెల కిషోర్‌బాబు, తోట చంద్రశేఖర్‌లు గతంలో జనసేన పార్టీలో ఉన్నవారే.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెబుతున్నారు. టీడీపీతో పొత్తుకు కూడా సంకేతాలు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒకవేళ కూటమిని ఏర్పాటు చేస్తే.. దానిని ఏకిపారేయాలన్నది కేసీఆర్ ప్లాన్. జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే ఉమ్మడి పోరు సాగుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కలిపి ఉంచేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాన్ని కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఓ వర్గం అభిప్రాయపడుతుంది. ఈ ప్రయత్నంలో కేసీఆర్ విజయం సాధిస్తే మరోసారి జగన్ గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. అయితే ప్రత్యర్థి పడవను తొక్కడం ద్వారా వారు మునిగిపోతారా? లేదా ఈదుకుని ఒడ్డుకు చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
పేద పార్టీ, ధనిక కార్యకర్తలు..
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకసారి తమ పార్టీ బ్యాంకులో రూ. 47,000 మాత్రమే ఉందని చెప్పారు. కానీ ఆమె పార్టీలోని కొందరు సీనియర్ నేతల వద్ద కేంద్ర నిఘా సంస్థల దాడుల్లో కోట్లాది రూపాయలు వెలుగుచూశాయి. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ వద్ద నుంచి రూ. 15 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అతని వాదన ఏమిటంటే.. ఆ డబ్బు తన వ్యాపార కార్యకలాపాల ద్వారా సంపాదించబడింది. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సంబంధించి తన వాదనను సమర్థించుకోవడానికి సరైన ఆదాయ వనరులను అందించలేకపోయారు.
Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: కోడళ్ల మధ్య పోరు, యాక్షన్‌లో ఆమె మిస్సింగ్, ట్రోఫిపై మ్యాప్ కథేంటి..
మరోవైపు టీఆర్ఎస్ కూడా హుస్సేన్ వాదనను ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఐటీ దాడులు టీఎంసీ ప్రతిష్టను మసకబారడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నమని పేర్కొన్నారు. ‘‘అతను (హుస్సేన్) తన కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నగదును ఉంచుకున్నాడు’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే.. గత సంవత్సరం విద్యా కుంభకోణం తరువాత జరిగిన దాడులలో మమత క్యాబినెట్‌లో అప్పుడు కీలక వ్యక్తిగా ఉన్న పార్థ ఛటర్జీకి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 50 కోట్ల రూపాయలకు పైగా రికవరీ చేసింది. ఇంత ధనవంతులైన సభ్యులు ఉన్నప్పటికీ.. పార్టీ ఎందుకు పేదగా ఉంది అనేది పెద్ద పజిల్ అనే చెప్పాలి.