న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీపై చౌకీదార్ చోర్  వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కూడ సమర్ధించినట్టుగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపర్చే ఉద్దేశం లేదని ఆయన సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు.

చౌకీదార్ చోర్ వ్యాఖ్యల విషయమై మంగళవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తానని రాహుల్ తరపున అభిషేక్ కోర్టకు వివరణ ఇచ్చారు.

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల విషయంలో రాహుల్ ఇంతవరకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  చింతించడం అనే పదం కోసం 22 పేజీల అఫిడవిట్ ఎందుకని సుప్రీం ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

చౌకీదార్ చోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్: రాహుల్‌పై మరోసారి సుప్రీం సీరియస్

చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ గాంధీకి సుప్రీం షాక్

విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి