Asianet News TeluguAsianet News Telugu

ఉచితాలు ఎప్పుడూ ‘ఉచితం’ కాదు.. పార్టీలు ఆర్థికాంశాలు ఆలోచించాలి - ఆర్బీఐ ఎంపీసీ మెంబర్ అషిమా గోయల్

ఉచిత పథకాలను ప్రకటించే ముందు రాజకీయ పార్టీలు ఆర్థిక అంశాలను ఆలోచించాలని ఆర్బీఐ ఎంపీసీ మెంబర్ అషిమా గోయల్ తెలిపారు. ఉచితాలు హానికరం అని ఆయన అభిప్రాయపడ్డారు. 

Freebies are never 'free'.. Parties should think about finances - RBI MPC Member Ashima Goyal
Author
First Published Aug 21, 2022, 2:09 PM IST

ఉచితాలు ఎప్పుడూ ‘ఉచితం’ కావని, రాజకీయ పార్టీలు ఉచిత ప‌థ‌కాల‌ను ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు ఆర్థికాంశాల‌ను ఆలోచించాల‌ని ఆర్బీఐ ఎంపీసీ (ద్ర‌వ్య విధాన క‌మిటీ) మెంబ‌ర్ అషిమా గోయల్ అన్నారు. ఓట‌ర్ల‌కు ఈ విష‌యాలను కూడా స్ప‌ష్టంగా తెలియ‌జేయాల‌ని ఆమె చెప్పారు. వార్తా సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ‘‘ ఉచితాలు ఎప్పుడూ ఉచితం కాదు... ధరలను వక్రీకరించే సబ్సిడీలు హానికరం ’’ అని ఆమె తెలిపారు. 

భారతదేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుతం ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గోయల్.. ఉచితాలు ఉత్పత్తి, వనరుల కేటాయింపును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ కారణంగా పంజాబ్‌లో నీటి మట్టం పడిపోవడం వంటి భారీ పరోక్ష ఖర్చులను విధిస్తుందని పేర్కొన్న గోయల్.. ఇలాంటి ఉచితాల వ‌ల్ల పేద‌లకు నాణ్యత లేని ఆరోగ్య, విద్య స‌దుపాయాలు, నీటి వ‌స‌తులు వ‌స్తాయ‌ని అన్నారు. “ పార్టీలు స్కీమ్‌లను ఆఫర్ చేసినప్పుడు ఓటర్లకు ఆర్థిక అంశాల‌ను స్ప‌ష్టంగా తెలియ‌జేయాలి. ఇది పోటీ పాపులిజం వైపు ప్రలోభాలను తగ్గిస్తుంది’’ అని అషిమా గోయల్ చెప్పారు.

రిక్రూట్‌మెంట్ పరీక్షలో చీటింగ్ అడ్డుకోవడానికి సంచలన నిర్ణయం.. ఆ 4 గంటలు ఇంటర్నెట్ బంద్

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక ప‌రిస్థితులు ఎలా ఉన్నా భారత వృద్ధి నిలకడగా కొన‌సాగుతోంద‌ని  ఆమె అన్నారు. భారతదేశం చాలా అంచనాల కంటే మెరుగ్గా ఉందని, సవాలుతో కూడిన పరిస్థితులలో చాలా దేశాలతో పోల్చితే, షాక్ ల‌ను గ్రహించడంలో సహాయపడే పెరుగుతున్న ఆర్థిక వైవిధ్యం దీనికి కారణాలలో ఒకటి అని ఆమె అన్నారు.

‘‘ భారీ దేశీయ డిమాండ్ ప్రపంచ మందగమనాన్ని నియంత్రించగలదు. పరిశ్రమ లాక్‌డౌన్‌తో బాధపడుతుంటే, వ్యవసాయం బాగా సాగుతుంది” అని ఆమె అన్నారు, డిజిటలైజేషన్, డిస్టెన్స్ వర్క్, ఎగుమతులతో తక్కువ కాంటాక్ట్ బేస్డ్ డెలివరీని సేవలు భర్తీ చేస్తాయి. ప్రపంచ వృద్ధి మందగించినప్పటికీ చైనా నుండి వైవిధ్యం, భారతదేశ డిజిటల్ ప్రయోజనం, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు దేశ అవుట్‌బౌండ్ షిప్‌మెంట్‌లకు మద్దతు ఇస్తాయ‌ని చెప్పారు. 

ఇప్పటి వరకు ఐదుగురిని చంపేశాం.. మూకదాడులపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ప్రపంచ ఎగుమతుల్లో ప్రస్తుతం భారత్‌లో ఉన్న అతి చిన్న వాటాలో పెరుగుదల సాధ్యమవుతుందని నొక్కి చెప్పిన గోయల్, ఆర్థిక రంగంలోని వైవిధ్యం, సంస్కరణలు దాని స్థిరత్వాన్ని మెరుగుపరిచాయని అన్నారు. “ తగినంత డిమాండ్‌ను కొనసాగిస్తూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమన్వయంతో కూడిన ఆర్థిక, ద్రవ్య విధాన చర్య బాగా పనిచేసింది. పెరుగుతున్న రియ‌ల్ పాలసీ రేట్లు అధిక వేడిని నిరోధించాయి, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచుతాయి, అవి సానుకూల విలువలను చేరుకుంటాయి,” అని ఆమె పేర్కొంది.

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఓ సందర్భంలో 'రివారీ' (ఉచితాలు) లు పెంచుతూ పోవ‌డం మంచిది కాద‌ని అన్నారు. ఇవి పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ (స్వయం-ఆధారం)గా మారడానికి భారతదేశం డ్రైవ్‌కు ఆటంకం కలిగించే ఆర్థిక విపత్తు కూడా అని వ్యాఖ్యానించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు, అలాగే గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్, నీటి వాగ్దానం వంటి హామీలను ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఎక్కడికి రావాలో చెప్పండి: సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం సవాలు

దీంతో దేశంలో ఉచిత పథ‌కాల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇటీల‌వ క‌ర్ణాట‌కలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఉచిత ప‌థ‌కాల‌పై వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ’ఉచితాలను’ ప్రకటించే ముందు తగిన బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బ‌లాన్ని చూసుకోవాల‌ని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఉచితాలు ఎలా ఉండవచ్చనే దృక్పథాన్ని తప్పనిసరిగా కల్గి ఉండాల‌ని, అలాగే తగినంత ఆర్థిక బలం ఉందా లేదా అనే విష‌యాన్ని తెలుసుకోవాల‌ని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios