Asianet News TeluguAsianet News Telugu

విషాదం...భోపాల్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు శిశువులు మృతి..

స్పెషల్ న్యూ బర్న్ కేర్యూ నిట్ (SNCU) వార్డులో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు చనిపోయి ఉండవచ్చు, బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు...

Four Newborns Killed In Bhopal Hospital Fire
Author
Hyderabad, First Published Nov 9, 2021, 8:26 AM IST

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు నవజాత శిశువులు మరణించారు. కమలా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని newborn-care unitలో మంటలు వ్యాపించాయి. 

"స్పెషల్ నవజాత శిశు సంరక్షణ యూనిట్ (SNCU) వార్డులో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు చనిపోయి ఉండవచ్చు, బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే మేం ఇతరులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాం. వార్డు లోపల అంతా చీకటిగా ఉంది. మిగిలిన పిల్లలను పక్కనే ఉన్న వార్డుకు తరలించాం’’ అని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.

ఆసుపత్రిలోని మూడవ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ అంతస్తులోనే ఐసియు వార్డు ఉంది. ఈ ఐసియు వార్డులో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయని, వెంటనే సమాచారం తెలియడంతో.. 8-10 మంది అగ్నిమాపక ఇంజనీర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫతేఘర్ ఫైర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జుబేర్ ఖాన్ తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ సమయంలో వార్డు నుంచి బయటపడ్డ తల్లిదండ్రులు షాక్ లో ఉన్నారని.. వారికి మెట్లు విరిగిపోతున్నట్టుగా అనుభూమతి చెందారని.. భయంతో వణికిపోయారని ఆస్పత్రి వీడియోల్లో కనిపిస్తోంది. rescue operation తరువాత మిగిలిన నవజాత శిశువులను వివిధ వార్డులకు తరలించారు.

దీనిమీద ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన చిన్నారులకు సంతాపం తెలిపారు. ఈ సంఘటన "చాలా బాధాకరమైనది" అని అన్నారు. 

"అగ్ని ప్రమాదంలో అప్పటికే తీవ్రంగా గాయపడిన ముగ్గురు పిల్లలను మేం రక్షించలేకపోయాం. ఇది చాలా బాధాకరం. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరిగింది. మంటలు అదుపులోకి వచ్చాయి. కాకపోతే, దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లల ప్రాణాలను రక్షించలేకపోయాం" అని Shivraj Singh Chouhan అంతకుముందు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన తర్వాత మరో శిశువు చనిపోయాడు. 

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదని భార్యను తెగనరికాడు...!

"ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. అదనపు చీఫ్ సెక్రటరీ (ఏసీఎస్) హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, మహ్మద్ సులేమాన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది" అని Chief Minister మరో ట్వీట్‌లో తెలిపారు.

మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.ఈ ఘటన "చాలా బాధాకరమైనది" అని పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ఈ సంఘటనపై "ఉన్నత స్థాయి విచారణ" చేయించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభం, శుభం తెలియని చిన్నారులు అగ్నికి ఆహుతి అవ్వడం అందరినీ కలిచి వేసింది. ఇంకా కళ్లు తెరవని,  తల్లి కడుపులోనుంచి అప్పుడే బయటపడ్డ చిన్నారులు ఇలా అర్థాంతరంగా కన్ను మూయడం వారి కుటుంబాల్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios