హరీశ్ సాల్వే లేటు వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నారు. చాలా తక్కువ మంది బంధు మిత్రుల మధ్య లండన్‌లో త్రీనాను మనువాడారు. ఈ ప్రైవేట్ ఈవెంట్‌కు నీతా అంబానీ, లలిత్ మోడీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 

న్యూఢిల్లీ: మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, 68 ఏళ్ల అడ్వకేట్ హరీశ్ సాల్వే మూడో పెళ్లి చేసుకున్నారు. లండన్‌లో ఒక ప్రైవేటు వేడుకలో త్రీనాను పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. అందులో హరీశ్ సాల్వే తన భార్య త్రీనా నుదురును ముద్దు పెట్టిన ఫొటోలూ కనిపించాయి.

చాలా తక్కువ మందితో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖులు వచ్చారు. నీతా అంబానీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ, ఆయన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ ఉజ్వల రౌత్ కూడా ఈ వేడుకలో పాల్గొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. 

హరీశ్ సాల్వేకు ఇది మూడో పెళ్లి. మీనాక్షితో మొదటి పెళ్లి జరిగింది. ఆమెతో 38 ఏళ్లు కలిసి ఉన్నారు. 2020 జూన్‌లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు సాక్షి, సానియాలు ఉన్నారు. 

68 ఏళ్ల వయసు ఉన్న అడ్వకేట్ హరీశ్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు. కుల్‌భూషణ్ జాదవ్ సహా పలు కీలక హై ప్రొఫైల్ కేసులను ఆయన వాదించారు. ఈ కేసు కోసం ఆయన కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజుగా తీసుకున్నారు. కృష్ణ గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులను ఆయన వాదించారు.

Also Read: ఉదయనిధి స్టాలిన్ మరో కామెంట్.. ఈ సారి ప్రధాని మోడీ టార్గెట్‌గా ఫైర్

1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ నెల వరకు ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. వేల్స్ అండ్ ఇంగ్లాండ్ క్వీన్స్ కౌన్సిల్‌గా ఆయన జనవరిలో నియామకమయ్యారు.

నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన హరీశ్ సాల్వే ఢిల్లీ హైకోర్టులో 1992లో సీనియర్ అడ్వకేట్‌గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు.