కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖ‌ర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సుధీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా పని చేశారు. ఆయన హఠాత్తుగా ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. 

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియ‌న్ నాయ‌కుడు సునీల్ జాఖ‌ర్ ఒక్క సారిగా పార్టీకి రాజీనామ చేశాడు. పార్టీని వీడుతున్న‌ట్టు శ‌నివారం ఆయ‌న ప్ర‌క‌టించారు. పంజాబ్ లో ప్ర‌ముఖ హిందూ ఫేస్ గా ఉన్న జాఖ‌ర్ త‌న ఫేస్ బుక్ పేజీ ద్వారా ‘‘గుడ్ ల‌క్, గుడ్ బై కాంగ్రెస్’’ అంటూ వెల్ల‌డించారు. 

ఏప్రిల్ నెల‌లో పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై వ్యాఖ్య‌లు చేసినందుకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ జాఖర్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీలోని దళిత నాయకులను తీవ్రంగా బాధించాయి. అత‌డిని కాంగ్రెస్ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని పార్టీ నేత ఉదిత్ రాజ్ డిమాండ్ చేశారు. 

Chidambaram: దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కీల‌క వ్యాఖ్య‌లు..

“బలహీన కులస్తుడైన చన్నీని ముఖ్యమంత్రిని చేయలేనని పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సునీల్ ఝాఖర్ కులతత్వ, భూస్వామ్య వ్యాఖ్య చేసినందుకు పార్టీ నుండి బహిష్కరించాలి. ఆయ‌న స్థానం తలపై కాకుండా పాదాలలో ఉంది” అని ఉదిత్ రాజ్ చెప్పారు. కాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత జాఖర్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ పట్ల ఆయ‌న అసంతృప్తిగా ఉన్నాయనే ఊహాగానాలకు దారితీసింది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో, సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప్ర‌కటించ‌కముందే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేసేలా సునీల్ జాఖ‌ర్ మాట్లాడారు. నవజ్యోత్ సిద్ధూ, చరణ్‌జిత్ చన్నీ పంజాబ్ కు సీఎం అయ్యే అవ‌కాశాలు తక్కువ‌గా ఉన్నాయ‌ని అన్నారు. 79 మంది ఎమ్మెల్యేలో 42 మంది త‌న పేరునే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని మొగ్గు చూపుతున్నార‌ని అన్నారు. కాబ‌ట్టే తానే మొద‌టి ఛాయిస్ అని చెప్పారు. 

పంజాబ్ జైళ్లలో ఇక వీఐపీ గదులుండ‌వ్.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సీఎం భ‌గ‌వంత్ మాన్..

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత సీఎం పదవికి త‌మ ప్రాధ్యాన్య‌త క్ర‌మంలో అభిప్రాయాన్నిచెప్పాల‌ని కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం 79 మంది పంజాబ్ ఎమ్మెల్యేలను కోరినట్లు ఒక వీడియోలో జాఖర్ చెప్పారు. “ సునీల్ జాఖర్‌కు 42 మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపగా, సుఖ్‌జిందర్ రాంధావాకు 16 ఓట్లు, ప్రణీత్ కౌర్‌కు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నవజ్యోత్ సిద్ధూ ను ఆరుగురు ఎమ్మెల్యేలు, చ‌ర‌ణ్ జిత్ సింగ్ చన్నీలను ఇద్దరు ఎమ్మెల్యేలు ప్ర‌తిపాదించారు ’’ అని ఆయ‌న అన్నారు. 

పార్టీలో అత్యున్నత పదవిని తాను తిరస్కరించినప్పటికీ, చాలా మంది ఎమ్మెల్యేలు తనపై విశ్వాసం ఉంచ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని జాఖ‌ర్ అన్నారు. అయితే తాను ఏ ప‌ద‌వీ చేప‌ట్ట‌బోన‌ని, అయిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యేలు త‌న‌కు అనుకూలంగా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. 

మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా పనిచేసిన జాఖర్ శ‌నివారం ఉద‌యం త‌న ఫేస్ బుక్ పేజీలో ‘‘మన్ కీ బాత్’’ పేరుతో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనంతరం తన ట్విట్టర్ అకౌంట్ బయో నుండి కాంగ్రెస్‌ని తొలగించారు. దాని స్థానంలో జాతీయ జెండాను ఉంచారు. అయితే జాఖర్ నిష్క్రమణపై పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందిస్తూ ‘‘ కాంగ్రెస్ సునీల్ జాఖర్‌ను వదులుకోకూడదు (ఆయన) బంగారు విలువ కలిగిన ఆస్తి. ఏవైనా విభేదాలు కూర్చొని పరిష్కరించుకోవాలి’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు.