పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో వీఐపీలకు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ సెక్యూరిటీని తొలగించిన ఆయన తాజాగా జైళ్లలో వీఐపీ కల్చర్ కు స్వస్తి పలికారు. పంజాబ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వీఐపీ గదులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికే ప్రయత్నంలో భాగంగా జైళ్లలోని వీఐపీ గదులన్నింటినీ మూసివేసి మేనేజ్‌మెంట్ బ్లాక్‌లుగా మార్చాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ‌దుల‌ను సిబ్బందికి అప్ప‌గించాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో వివ‌రాలు వెల్ల‌డించారు. 

‘‘ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో, జైలు సిబ్బంది సజావుగా పనిచేసేందుకు వీలుగా జైళ్లలోని అన్ని వీఐపీ గదులను జైలు నిర్వహణ బ్లాక్‌లుగా మారుస్తాము. జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని భగవంత్ మాన్ శనివారం తెలిపారు. 

Chennai: సొంత కుమార్తెపై ప్రియుడితో అత్యాచారం చేయించిన మహిళ.. ఇంట్లో ప్రసవం..

జైలు ప్రాంగణంలో గ్యాంగ్‌స్టర్ల 710 మొబైల్ ఫోన్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ సీఎం చెప్పారు. ‘‘ మేము మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాం. దీనితో పాటు లోపల ఫోన్‌లను తీసుకున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నాం. దీనిపై విచారణ చేేసేందుకు సిట్ ఏర్పాటు చేశాం. ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేస్తున్నాం. మేము కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేశాం ’’ అని సీఎం తెలిపారు. పంజాబీ పాటలలో తుపాకీ సంస్కృతి. డ్రగ్స్‌ను ప్రోత్సహించడాన్ని ఆయన ఖండించారు. గాయకులు తమ పాటల ద్వారా సమాజంలో హింస, ద్వేషం, శత్రుత్వాన్ని పెంచవద్దని కోరారు. 

‘‘ మీరందరూ పంజాబ్, పంజాబీ యాత్ నీతిని అనుసరించాలి. అలాంటి పాటల ద్వారా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసే బదులు సోదరభావం, శాంతి, సామరస్య బంధాలను బలోపేతం చేయాలి ’’ అని అన్నార. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో గాయకులు బాధ్యత వహించాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

ముగ్గురు పోలీసులను కాల్చి చంపిన కృష్ణజింకల వేటగాళ్లు.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యవసర సమావేశం..

ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన తరువాత కూడా వీఐపీల‌కు ప్ర‌భుత్వ సెక్యూరిటీని తీసివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీకున్నారు. మార్చిలో 13వ తేదీన మొద‌టి సారిగా 122 మందికి సెక్యూరిటీని తొలగించారు. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాగే ఏప్రిల్ 24వ తేదీన మ‌రో 184 మంది ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల సెక్యూరిటీని తొల‌గించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.