దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో తెలంగాణ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ ఘటన జరిగిన నాటి నుంచి ఏడేళ్ల క్రితం ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో పోల్చి చూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమీషనర్ నీరజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిర్భయ ఘటన సమయంలో మాపై చాలా ఒత్తిడి వచ్చిందని... కానీ నిందితులను చంపేయాలన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదన్నారు. ఎన్‌కౌంటర్‌తో పాటు ఆకలిగా ఉన్న సింహాలకు నిందితులను వదిలిపెట్టాలని తమకు చాలా సందేశాలు వచ్చాయని నీరజ్ గుర్తుచేశారు.

Also read:దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్

ఎంత ఒత్తిడి వచ్చినా కానీ తాము చట్టాన్ని అనుసరించామని నీరజ్ కుమార్ స్ఫష్టం చేశారు. అలాగే షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ తర్వాత ప్రజల సంబరాలను చూస్తుంటే.. ఈ తరహా నేరాలను సహించే పరిస్ధితులు లేవని, సత్వర న్యాయాన్ని వారు కోరుకుంటున్నారని నీరజ్ వెల్లడించారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో నీరజ్ ఆ కేసును పర్యవేక్షించారు. 

Also Read:CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?

కాగా నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పెట్టుకున్న పిటిషన్‌ సందర్భంగా రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. వినయ్ శర్మ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫారసు చేసింది.

Also read:Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ...

అంతకు ముందు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసులో వినయ్ శర్మతో పాటు మరో ముగ్గురు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధించింది. ప్రస్తుతం వీరు తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.