మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. నిర్దోషిగా తేలిన హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా
2012లో జరిగిన మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా నిర్దోషిగా తేలారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా, ఆయన అనుచరురాలు అరుణ చద్దాలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గోపాల్ కందాను నిర్దోషిగా విడుదల చేయడంపై పోలీసులు అప్పీల్ దాఖలు చేస్తే రూ. లక్ష వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, హాజరు కావాలని కోర్టు కోరింది.
యువతిపై ఆరేళ్ల బాలుడు, చనిపోయిన మహిళ అత్యాచారం - యూపీలో వింత ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే ?
గోపాల్ కందాకు చెందిన ఎంఎల్డీఆర్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన గీతికా శర్మ.. 2012 ఆగస్టు 5న వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే అక్కడ ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో గోపాల్ కందా, మరో వ్యక్తి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శర్మ పేర్కొన్నట్టు రాసి ఉంది.
కాగా.. అదే సమయంలో గోపాల్ కందా (46) హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అతడిపై కేసు నమోదు కావడంతో ఆయన హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తన హర్యానా లోక్హిత్ పార్టీ నుంచి సిర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..
గోపాల్ కందాపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 506 (క్రిమినల్ బెదిరింపులు), 201 (సాక్ష్యాల విధ్వంసం), 120 బి (నేరపూరిత కుట్ర), 466 (ఫోర్జరీ) సహా వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ట్రయల్ కోర్టు అతనిపై అత్యాచారం (376), 377 (అసహజ సెక్స్) అభియోగాలను కూడా మోపింది, అయితే ఢిల్లీ హైకోర్టు వాటిని కొట్టివేసింది. కాగా.. ఈ తీర్పుపై గీతికా శర్మ సోదరుడు అంకిత్ స్పందించారు. ఈ తీర్పు తమ కుటుంబం చాలా నిరాశకు గురి చేసిందని అన్నారు.