Asianet News TeluguAsianet News Telugu

మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..

ఆ యువకుడిని చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతలే పెంచారు. అయితే కొంత కాలం నుంచి అతడికి మానసిక ఆరోగ్యం బాగలేదు. దీంతో మానసిక హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చి అమ్మమ్మ, తాతలను హతమార్చాడు.

After receiving treatment in a mental hospital, he returned home.. The brutal murder of his grandfather and grandmother..ISR
Author
First Published Jul 25, 2023, 9:13 AM IST | Last Updated Jul 25, 2023, 9:13 AM IST

ఆ యువకుడి మానసిక ఆరోగ్యం బాగాలేదు. దీంతో అతడి అమ్మమ్మ, తాతలను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడి డాక్టర్లు యువకుడికి ట్రీట్ మెంట్ అందించారు. మానసిక ఆరోగ్యం మెరుగయ్యాక అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న అమ్మమ్మ, తాతలను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన  కేరళలో చోటు చేసుకుంది. 

పరమేశ్వరుడిని వివాహమాడిన యువతి.. జీవితాన్ని శివుడికే అంకితమివ్వాలనే నిర్ణయం..

వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ కు చెందిన 75 ఏళ్ల అబ్దుల్లా, 64 ఏళ్ల జమీలాలు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమెకు కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అక్కల్ అనే కుమారుడు జన్మించాడు. అయితే కొన్నేళ్ల కిందట ఆమె భర్త చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు మరో వివాహం జరిపించారు. అప్పటి నుంచి అక్కల్ తన అమ్మమ్మ, తాత దగ్గరే ఉంటున్నాడు.

వైఎస్ షర్మిలా, విజయమ్మల్లో ఒకరికే ఎంపీ టికెట్ అని చెప్పిన వివేకా - కొమ్మా శివచంద్రారెడ్డి స్టేట్ మెంట్

అక్కల్ యుక్త వయస్సుకు చేరుకున్నాడు. కొంత కాలం నుంచి మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మమ్మ, తాతలు స్థానికంగా ఉండే ఓ మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు చికిత్స అందించడంతో అతడు కోలుకున్నాడు. దీంతో అక్కల్ ను ఇంటికి పంపించేశారు. దీంతో అతడు ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. రాత్రి అందరూ ఇంట్లోనే నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున తాత, అమ్మమ్మలను అక్కల్ హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం సమయంలో ఓ బంధువు ఆ వృద్ధుల ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

విషాదం.. నిద్రపోతున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. అస్వస్థతతో మృతి

దీనిపై అతడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి కర్ణాటకలో ఉన్నాడని తెలిసింది. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు అక్కల్ ను అరెస్టు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios