యువతిపై ఆరేళ్ల బాలుడు, చనిపోయిన మహిళ అత్యాచారం - యూపీలో వింత ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే ?
పలువురు దండగులు తనపై దాడి చేసి, అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె నిందితులుగా పేర్కొన్న వారిలో కొన్నేళ్ల కిందట చనిపోయిన మహిళ, ఆరేళ్ల బాలుడి పేర్లు కూడా ఉన్నాయి.
తనను ఆరేళ్ల బాలుడు, చనిపోయిన మహిళ సహా ఎనిమిది మంది అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కూడా సందిగ్ధంలో పడ్డారు. ఈ విచిత్ర కేసు కాన్పూర్ రావత్ పూర్ ప్రాంతంలో చర్చనీయాంశం అయ్యింది.
మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..
బాధితురాలి ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ రావత్ పూర్ ప్రాంతానికి చెందిన కరణ్ రాజ్ పుత్ అనే యువకుడు పంకీ ప్రాంతంలో ఉంటున్న యవతిని ప్రేమించాడు. రెండు సంవత్సరాల పాటు వీరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. కానీ ఏమైందో తెలియదు గానీ.. ఆమెతో పెళ్లికి కరణ్ రాజ్ పుత్ నిరాకరించారు. ఆ యువతిని పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పాడు.
దీంతో ఆమె అతడిని నిలదీసింది. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నించింది. దీనిపై చర్చించేందుకు కాన్పూర్ లో ఉన్న ఎకో గ్రామానికి రావాలని ఆమెను కరణ్ అహ్వానించాడు. అతడి ఆహ్వానం మేరకు ఆ యువతి గ్రామంలోకి వెళ్లింది. ఈ చర్చ సమయంలో ఆమెపై పలువురు దాడి చేశారు. ఆమె ఉంగరం, డబ్బు, ఇతర విలువైన వస్తువులను లాక్కున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పరమేశ్వరుడిని వివాహమాడిన యువతి.. జీవితాన్ని శివుడికే అంకితమివ్వాలనే నిర్ణయం..
కాన్పూర్ లోని రావత్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి చేసిన యువకుడి బంధువులందరి ఫిర్యాదు చేసింది. కరణ్ రాజ్ పుత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తరువాత మోహం చాటేశాడని తెలిపింది. ఇదేంటని ప్రశ్నించినందుకు అతడి బంధువులు తనను చితకబాది, లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఇందులో ఆ యువకుడి అత్త, ఆరేళ్ల బాలుడు సహా మొత్తం ఎనిమిది మందిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 376 (లైంగిక దాడికి సంబంధించినది), 392 (దోపిడీకి సంబంధించినది) తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విషాదం.. నిద్రపోతున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. అస్వస్థతతో మృతి
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫిర్యాదులో పేరున్న యువకుడి అత్త కొన్నేళ్ల కిందటే మరణించిందని తెలుసుకున్నారు. మరో పేరున్న బాలుడికి ప్రస్తుతం ఆరు సంవత్సరాలే ఉన్నాయని గుర్తించారు. దీంతో వారిద్దరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వికాస్ పాండే మీడియాతో మాట్లాడారు. బాధితురాలు ఆరోపణలు చేస్తున్న యువకుడి అత్త, ఆరేళ్ల బాలుడి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించామని చెప్పారు.