Asianet News TeluguAsianet News Telugu

ayodhya ram mandir : పొగ మంచు ఎఫెక్ట్.. ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో మార్పులు..?

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లాకు శంకుస్థాపన చేసే రోజు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. 

For Ram Mandir Event, A Change In Plan For PM Modi Due To Fog Chaos? ksp
Author
First Published Jan 17, 2024, 9:36 PM IST

ప్రస్తుతం కేరళలో రెండు రోజుల పర్యటనలో వున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ వారం చివరిలో అయోధ్యలో మహా సంప్రోక్షణ (ప్రాణ్ ప్రతిష్ట) కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లాకు శంకుస్థాపన చేసే రోజు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. 

 

జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ (ప్రాణ ప్రతిష్ట) కార్యక్రమానికి ఒకరోజు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమయ్యే పరిస్ధితిని దృష్టిలో వుంచుకుని మోడీ షెడ్యూల్‌లో ఈ మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కోసం వైదిక ఆచారాలు జనవరి 22న ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16న ప్రారంభం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 గంటల మధ్య ప్రధాన వేడుక జరగనుంది. ప్రాణ్ ప్రతిష్ట చేయడానికి ముందు మోడీ 11 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఇందులో ‘యం నియమం’, నైతిక ప్రవర్తన సూత్రాల ఆధారంగా సాధారణ ప్రార్ధనలు, యోగా వుంటాయి. 

‘‘ఇది చాలా పెద్ద బాధ్యత.. మన గ్రంథాలలో చెప్పబడినట్లుగా యాగాలు, భగవంతుని ఆరాధాన కోసం మనలో దైవిక స్పృహను మేల్కోల్పాలని, ఇందుకోసం ఉపావాసాలు, కఠినమైన గ్రంథాలలో నిర్దేశించారు’’ అని మోడీ తన 11 రోజుల దీక్షను ప్రకటించారు. నాసిక్‌లోని పంచవటి నుంచి ఈ దీక్షను ఆయన ప్రారంభించారు. ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణులు వనవాస సమయంలో వున్నారు. 

 

 

ఇదిలావుండగా.. జనవరి 11న జరిగే ప్రధాన యజ్ఞం (పోషకుడు)గా ప్రధాని మోడీ వ్యవహరిస్తారని కాశీకి చెందిన ప్రముఖ వేద కర్మకాండ్ (ఆచారాలు) పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ మంగళవారం స్పష్టం చేశారు. దీక్షిత్ (ప్రాణ ప్రతిష్ట) కార్యక్రమానికి ప్రధాన ఆచార్యుడు. ఈ క్రతువును కాశీ పండితుడితో పాటు పూజారి గణేశ్వర శాస్త్రి ద్రవిడ్‌తో పాటు 121 మంది పండితుల బృందం పర్యవేక్షించనుంది. 

సామాజిక జీవితంలో సుపరిపాలనకు రాముడు ప్రతీక అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. జనవరి 23 నుంచి రామ మందిరాన్ని సాధారణ ప్రజలను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios