విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఛార్జీ ఎంతో తెలుసా

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులను సిద్ధం చేసింది.

Flight charges for indians stranded in abroad

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులను సిద్ధం చేసింది.

అమెరికా నుంచి ఏడు, బ్రిటన్ నుంచి ఏడు విమానాల ద్వారా భారతీయులను తరలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రయాణ ఖర్చుల ఛార్ట్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 64 విమానాల్లో విదేశాల్లో ఉన్న 14,800 మంది ఇండియాకు

బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే యూఎస్ అయితే ఈ చార్జీని లక్షగా నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో ఎక్కువ విమానాలను కేరళ నుంచి పంపనున్నారు. ఢిల్లీ-తమిళనాడు నుంచి 11 చొప్పున, మహారాష్ట్ర-తెలంగాణ నుంచి 7 చొప్పున, గుజరాత్ నుంచి 5, జమ్మూకాశ్మీర్, కర్ణాటక నుంచి 3, పంజాబ్-యూపీ నుంచి ఒక్కొక్కటి చొప్పున విమానాలు బయల్దేరనున్నాయి.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 600 కి.మీ. సైకిల్‌పైనే, అరటిపండ్లే ఆహారం

తొమ్మిది దేశాల నుంచి వచ్చే 11 విమానాలు తమిళనాడు చేరుకుంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. మనిలా-చెన్నై, షికాగో-ఢిల్లీ, హైదరాబాద్-న్యూయార్క్-ఢిల్లీ-హైదరాబాద్, కువైట్-కోజికోడ్, శాన్ ఫ్రాన్సిస్కో-ఢిల్లీ-బెంగుళూరు రూట్లను పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రతిరోజూ 2 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios