లాక్‌డౌన్ ఎఫెక్ట్: 64 విమానాల్లో విదేశాల్లో ఉన్న 14,800 మంది ఇండియాకు

లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకొన్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విమానాలు, ఓడల ద్వారా విదేశాల నుండి భారతీయులను రప్పించేందుకు కేంద్ర విదేశాంగ తెలిపింది.

14800 Indians On 64 Flights Centres Mega Evacuation Plan Amid Lockdown

న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకొన్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విమానాలు, ఓడల ద్వారా విదేశాల నుండి భారతీయులను రప్పించేందుకు కేంద్ర విదేశాంగ తెలిపింది.

ఇండియా నుండి 64 విమానాలను  పలు దేశాలకు పంపనున్నారు. సుమారు 14,800 మంది భారతీయులను స్వదేశానికి రప్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ పలు దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలకు సమాచారం పంపింది.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 600 కి.మీ. సైకిల్‌పైనే, అరటిపండ్లే ఆహారం

ప్రపంచంలోని 13 దేశాలకు భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అమెరికా, ఫిలిఫ్పైన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, సౌదీ అరేబియా, ఖతార్, సింగపూర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ దేశాలకు ఇండియా నుండి విమానాలను పంపనున్నారు. ఈ నెల 7వ  తేదీ నుండి విదేశాలకు విమానాలను పంపి భారతీయులను స్వదేశానికి రప్పించనున్నారు.

ఈ నెల 7వ తేదీన 10 విమానాల్లో 2300 మందిని ఇండియాకు రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత రోజున తొమ్మిది దేశాల నుండి సుమారు 2050 భారతీయులను తీసుకువస్తారు. మూడో రోజున దక్షిణాసియా. అమెరికాలో చిక్కుకొన్న వారిని స్వదేశానికి తీసుకొస్తారు. ఇక వెయ్యి మందిని ఐఎన్ఎస్ నౌక ద్వారా వెయ్యి మందిని ఇండియాకు రప్పించనున్నారు. 

ఇండియాకు వచ్చేవారు కరోనా లక్షణాలు ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలని భారత రాయబార కార్యాలయాలు కోరాయి. విమానాలు ఎక్కే ముందు కూడ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలు లేనివారికే ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios