చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె చీఫ్  కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి  ఐదు దపాలు  సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.  సుదీర్ఘకాలం పాటు  ఆయన రాజకీయాల్లో  కొనసాగారు. 

తమిళనాడు  రాష్ట్రానికి  తొలుత  1969లో కరుణానిధి సీఎంగా  బాధ్యతలు స్వీకరించారు. 1969 ఫిబ్రవరి 10వ తేదీన కరుణానిధి తొలిసారిగా సీఎంగా బాధ్యతలను చేపట్టారు. తొలిసారిగా సీఎంగా సుమారు 693 రోజుల పాటు సీఎంగా  కొనసాగారు.  1971 జనవరి 4వ, తేదీ వరకు  ఈ కరుణానిధి తొలిసారి సీఎంగా బాధ్యతల్లో కొనసాగారు.ఆ తర్వాత రెండోసారి కూడ కరుణానిధి 1971లో సీఎంగా ఎన్నికయ్యారు.

1971 మార్చి 15న రెండోసారి  తమిళనాడు సీఎంగా కరుణానిధి బాధ్యతలను చేపట్టారు.   31 జనవరి 1976 వరకు కరుణానిధి సీఎంగా రెండోసారి కొనసాగారు. 1989 జనవరి 27లో మూడోసారి కరుణానిధి సీఎంగా ఎన్నికయ్యారు. 1991వరకు జూన్ 24వ తేదీ వరకు ఆయన సీఎంగా కొనసాగారు. 1991 జనవరి 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 

1996 మే 13వ తేదీ నుండి 2001 మే 13 వ తేదీవరకు  నాలుగోసారి కరుణానిధి సీఎంగా  ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006 మే 13వ తేదీ నుండి 2011 మే 15వ తేదీ వరకు కరుణానిధి సీఎంగా కొనసాగారు.

ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో డీఎంకె  అధికారంలోకి రాలేదు. 2011లోనే ఆయన సీఎం పదవిని కోల్పోయారు. 13 దఫాలు కరుణానిధి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఏ స్థానం నుండి పోటీ చేసినా కూడ ఆయన  ఓటమికి గురికాలేదు.