భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఐదుగురికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. పథనంతిట్ట జిల్లాకు చెందిన ముగ్గురు ఇటీవల ఇటలీ నుంచి రాగా, మరో ఇద్దరు స్థానికులకు కరోనా సోకింది. దీంతో కోవిడ్-19 బాధితుల సంఖ్య భారత్‌లో 39కి చేరింది.

Also Read:ఢిల్లీలో మరో కేసు: దేశంలో 31 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

కరోనా సోకిన విషయాన్ని కేరళ ఆర్ధిక మంత్రి కె.కె. శైలజ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ఐదుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. కాగా భారతదేశంలో తొలి మూడు కరోనా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. 

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలు, ఓడ రేవులు ఇతర ప్రాంతాల్లో స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌లకు భారత్ వీసాల జారీని రద్దు చేసింది. 

Also Read:మీడియా ఓవరాక్షన్.. కంగారుపడ్డ కరోనా అనుమానితుడు: హాస్పిటల్ నుంచి పరార్

శనివారం ఉదయం ఇరాన్‌ నుంచి 108 భారతీయులకు చెందిన రక్త నమూనాలు ఢిల్లీకి చేరుకున్నాయి. వీటిని ఎయిమ్స్ ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు. అటు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి పటిష్టమైన చర్యలు చేపట్టాయి.