మీడియా ఓవరాక్షన్.. కంగారుపడ్డ కరోనా అనుమానితుడు: హాస్పిటల్ నుంచి పరార్

పంజాబ్‌లో ఓ కరోనా అనుమానితుడు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేపింది. మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో మోగాలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. 

suspected CoronaVirus patient runs away from hospital in punjab

కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌‌లోనూ ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమై పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఇతర ప్రాంతాల్లో కరోనాను నిర్ధారించేందుకు చర్యలు చేపట్టింది.

ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ దేశంలో ఏదో ఒక మూల కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో ఓ కరోనా అనుమానితుడు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేపింది.

Also Read:రాహుల్ గాంధీ కరోనావైరస్ వ్యాప్తి చేస్తాడు: బిజెపి ఎంపీ సెటైర్

మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో మోగాలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు.

అదే సమయంలో ఈ వార్త దావానంలో వ్యాపించడంతో మీడియా ప్రతినిధులు ఆ పేషేంట్‌ను చుట్టుముట్టి ఫోటోలు తీశారు. దీనికి భయపడిపోయిన అతను ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. అయితే వెంటనే రంగంలోకి దిగిన మెడికల్ టీమ్ సదరు వ్యక్తి ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్లి అతనిని ఒప్పించి తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Also Read:ఉద్యోగికి కరోనా లక్షణాలు: ఆఫీసులను మూసేసిన పేటిఎం

ఆ వ్యక్తి రక్త నమూనాలను సేకరించి పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపింది. ప్రస్తుతం ఆ రిపోర్టుల కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పంజాబ్‌లో మరో రెండు కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు సింగపూర్, మరొకరు ఇండోనేషియా నుంచి భారతదేశానికి వచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios