తమిళనాడులోని చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ కోనేరులో మునిగి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. 

ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఆలయంలో భక్తులు ప్రమాదవశాత్తూ మెట్లబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. తాజాగా తమిళనాడులోని ఓ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరంలోని కీలకట్టలై ప్రాంతానికి సమీపంలోని ధర్మలింగేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు యువకులు స్నానాలు ఆచరించేందుకు దగ్గరలోని కోనేరుకు వెళ్లారు. అయితే వీరు కాసేపటికీ కోనేటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఐదు మృతదేహాలను వెలికి తీశారు. వీరంతా 18 నుంచి 23 ఏళ్ల లోపు వారే. ఒకేసారి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. చేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ALso Read: ఇండోర్ ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వున్న బేలేశ్వర్ మహదేవ్ ఝాలేలాల్ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే రద్దీ ఎక్కువగా వుండటంంతో కొందరు భక్తులు ఆలయంలో వున్న మెట్లబావి పైకప్పుపై కూర్చొన్నారు. దీంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కాగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు.